ఖజానా: రష్మిక పతనం మొదలవుతోందా..?
గతంలో అక్షయ తృతీయ తో ప్రారంభించి.. భారతదేశం అంతటా ప్రింటింగ్ , బహిరంగ, టీవీలలో ప్రకటన ద్వారా ఖజానా జ్యువెలరీకి చెందిన అందమైన డిజైన్లను రష్మిక ప్రమోట్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈమె ప్రవర్తన వల్ల కర్ణాటక ఇండస్ట్రీలో ఈమెపై పూర్తిస్థాయిలో వ్యతిరేక భావం కలుగుతున్న నేపథ్యంలో తమ రిటైల్ సంస్థ ఇమేజ్ తగ్గిపోతుందని ఆలోచించిన ఖజానా నిర్వాహకులు.. ఆమెను మార్చేసి ఆమె ప్లేస్ లో త్రిషను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటినుంచే రష్మిక కెరియర్ పతనమవుతోంది అన్నట్లుగా స్పష్టమవుతోంది.
ఇటీవల ఖజానా జ్యువెలరీ చైర్పర్సన్ మిస్టర్ కిషోర్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. కొన్ని అనివార్య కారణాలవల్ల రష్మికకు బదులుగా త్రిష ను తీసుకోబోతున్నామంటూ తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా త్రిష ఈ అవకాశాన్ని సొంతం చేసుకోవడం ఆమె కెరియర్ కు మరింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకున్న త్రిష ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ గా అత్యంత ప్రావీణ్యం పొందిన ఖజానా జ్యువెలరీ కు వ్యవహరించడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం త్రిష ఒకవైపు పాన్ ఇండియా సినిమా సక్సెస్ పొందుతూనే మరొకవైపు ఇంకొన్ని చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రిష ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా అదే క్రేజ్ తో దూసుకుపోతూ ఉండడం గమనార్హం.