
టాలీవుడ్ లో మొదలైన దిల్ రాజు మాఫియా.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!
అయితే సంక్రాంతి బరిలో డైరెక్ట్ చిత్రాలు కాకుండా డబ్బింగ్ చిత్రాలు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో తెలుగు నిర్మాతలు కాస్త వెనకడుగు వేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలో కేవలం డైరెక్ట్ చిత్రాలను మాత్రమే విడుదల చేయాలి అని, థియేటర్ల విషయంలో ఇబ్బందులు కలక్కుండా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. కానీ ఈ నిర్ణయాన్ని తిప్పికొడుతూ తమిళ్ డబ్బింగ్ చిత్రాలను తెలుగులో విడుదల అడ్డుకుంటే తెలుగు చిత్రాలను తమిళ్లో అడ్డుకుంటామని నిర్మాతలు రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తమిళ్ దర్శకులకు అనుకూలంగా దిల్ రాజు ప్రవర్తిస్తూ ఉండడం చూసి ప్రతి ఒక్కరు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అసలు విషయంలోకి వెళితే... తమిళ్ హీరో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన వారసుడు సినిమాకు నిర్మాతగా తెలుగు నిర్మాత దిల్ రాజు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దిల్ రాజు మాఫియా జరుగుతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు" మంచి థియేటర్స్ అన్ని వారసుడు సినిమాకే ఇస్తానని ఓపెన్గానే చెప్పేశాడు.." అంటే చిరంజీవి బాలయ్యల సినిమాలకు బి గ్రేడ్ థియేటర్లు వస్తాయా ? అని అందరూ అనుమానం వ్యక్తం చేయగా... మళ్లీ అతను తన మాటలను కూడా వక్రీకరిస్తూ f2 విడుదల సమయంలో తాను ఎప్పుడు అలాంటి ప్రకటన చేయలేదని చెప్పాడు..