విజయ్ దేవరకొండ లుక్ ..వైరల్ అవుతున్న ఫోటోలు..
ప్రస్తుతం ఆయన డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రీకరణ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో విజయ్ సరసన సమంత నటిస్తోంది. అయితే తాజాగా విజయ్ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సలార్ లో విజయ్ భాగం కానున్నారంటూ టాక్ వినిపిస్తోంది.కేజీఎఫ్ తో బాక్సాఫీస్ సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో సలార్ రూపొందుతుంది. ఈ మూవీ పై ఇప్పటికే అంచనాలు భారీగానే ఉన్నాయి.
సలార్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై ఆసక్తి పెంచగా.. ఇటీవల విడుదలైన వర్కింగ్ స్టిల్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి.ఇకపోతే ఈ సినిమా లో విజయ్ నటిస్తున్నారట. అది కూడా ప్రభాస్ తమ్ముడిగా విజయ్ కనిపించనున్నారని.. సలార్ క్లైమాక్స్ లో విజయ్ ను పరిచయం చేసి .. ఆ తర్వాత రానున్న సలార్ 2 చిత్రంలో కీలకమైన పాత్రలో ఆయన్ను చూపించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. నిజంగా విజయ్ ఉంటే మాత్రం హిట్ పక్కా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి... ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..