హన్సిక సినిమాలకు గుడ్ బై చెప్పనుందా?

Satvika
ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు సినిమాలను పక్కన పెట్టి పెళ్ళి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు..గత కొన్ని నెలలుగా చాలా మంది హీరోయిన్స్ అదే పనిలో ఉన్నారు. మొన్న నయన్, ఇప్పుడు హన్సిక కూడా సరైన అవకాశాలు లేక పెళ్లికి రెడీ అవుతుంది. తెలుగులో దేశముదురు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ అమ్మడు. ఆమె హీరోయిన్ అయినప్పుడు ఆమె వయసు కేవలం 16 మాత్రమే. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన దేశముదురు సినిమా సూపర్ హిట్ ను అందుకుంది..

హన్సిక తెలుగులో వరుసగా యంగ్ హీరోల సరసన సినిమాలు చేసింది. దాదాపుగా హన్సిక చేసిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ సాధించాయి. తెలుగులో బాగా పాపులర్ అయ్యాక ఈ భామకి తమిళంలో కూడా హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. తమిళ హీరోల కి హీరోయిన్ బొద్దుగా ఉంటే చాలా ఇష్టపడతారు. అలాంటి బొద్దుగుమ్మ కోలీవుడ్లో హిట్స్ అందుకుంటే ఆమెకి ఫుల్ ఫ్యాన్ అయ్యేవారు ఉన్నారు. అయితే ఇప్పుడు అభిమానులు హీరోలు ఏమైపోతారో అని నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అభిమానులు, హీరోలు ఏమైపోతారో అని నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేయడానికి కారణం హన్సిక పెళ్లి చేసుకోవాలను కోవడమే. తమిళ్లో శింబు, సిద్ధార్థ లాంటి హీరోలతో జోడి కట్టి రొమాన్స్ చేసింది. అలాగే బాలీవుడ్లో ఈ అమ్మడి ఫిజిక్ అంటే పడి సచ్చే వారు ఉన్నారు. ఈ భామ పెళ్లి చేసుకుంటే వారందరి పరిస్థితి ఏంటి అని చర్చించుకుంటున్నారు. వాళ్లకు ఇష్టమైన హీరోయిన్ పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయితే భరించడం కష్టమే అంటూ ఫ్యాన్స్ అంటున్నారు.త్వరలోనే హన్సిక పెళ్లి పీటలు ఎక్కుబోతుంది. దీంతో అభిమానులు తమకు ఇష్టమైన హీరోయిన్ సినిమాలకు దూరం అవుతుందని బాధపడుతున్నారు.. ఈ విషయం పై ఒక క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: