టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన
బాలకృష్ణ ఎవరినైనా నమ్మి అవకాశం ఇచ్చి ఆ నమ్మకాన్ని వాళ్లు నిలబెట్టుకుంటే మళ్లీ మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు. అయితే
బాలయ్య థమన్ కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ
సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక
బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమాకు కూడా
థమన్ మ్యూజిక్
డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. కాగా
బాలయ్య అనిల్ రావిపూడి కాంబో సినిమాకు కూడా
థమన్ మ్యూజిక్
డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇకపోతే
థమన్ కు వరుస ఛాన్స్ ల వెనుక
బాలకృష్ణ ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కాగా అఖండ సినిమాకు ముందు
బాలయ్య థమన్ కాంబినేషన్ లో ఒక్క
సినిమా కూడా రాలేదు. అఖండ
సినిమా భారీ విజయం సాధించడంతో పాటు
థమన్ కు క్రేజ్,
మార్కెట్ ను పెంచింది.ఇక అఖండ
సక్సెస్ తో
థమన్ కు
సినిమా ఆఫర్లు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి
సినిమా పాటలకు,బీజీఎంకు మంచి రెస్పాన్స్ వస్తే భవిష్యత్తులో
బాలయ్య హీరోగా తెరకెక్కనున్న పలు సినిమాలకు కూడా
థమన్ మ్యూజిక్
డైరెక్టర్ గా కొనసాగే ఛాన్స్ అయితే ఉంది.
అయితే
థమన్ ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.ఇకపోతే థమన్ తన సినిమాలకు కవర్ సాంగ్స్ చేయించడం ద్వారా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ కవర్ సాంగ్స్ ద్వారా సినిమాకు బడ్జెట్ పెరగడంతో పాటు సినిమాకు ఓపెనింగ్స్ కూడా రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి.ఇక కవర్ సాంగ్స్ కోసం కూడా
థమన్ భారీగా ఖర్చు చేయిస్తున్నారని టాక్ ఉన్నా ఆ ఖర్చు వల్ల సినిమాలకు మాత్రం మేలు జరుగుతుండటం గమనార్హం.ఇకపోతే సినిమాసినిమాకు
థమన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
థమన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది..!!