20 ఏళ్ల వయసులోనే ఆ చేదు అనుభవం ఎదురయింది... ఆండ్రియా..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి ఆండ్రియా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక మూవీ లలో నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది . ఆండ్రియా 2005 లో కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగం లోకి అడుగు పెట్టి తమిళం తో పాటు తెలుగు , మలయాళం సినిమా ల్లో నటించింది . ఇది ఇలా ఉంటే ఆండ్రియా తెలుగు లో నాగ చైతన్య సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తడాఖా మూవీ లో సునీల్ సరసన హీరోయిన్ గా నటించింది .

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అని రేంజ్ విజయాన్ని అందుకుంది . ఈ మూవీ ద్వారా ఆండ్రియా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను తగ్గించుకుంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఆండ్రియా తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల గురించి తాజాగా చెప్పుకొచ్చింది. నేను గతంలో ఒక వ్యక్తి తో సహ జీవనం చేశాను. కానీ నేను చాలా దారుణంగా మోసపోయాను. నాకు 20 ఏళ్ల వయసు లోనే ఈ అనుభవం ఎదురైందని తన వ్యక్తిగత జీవితం గురించి ఆండ్రియా తాజాగా కీలక విషయాలు చెప్పింది.

ఆ తర్వాత నేను ఎవరినీ  ప్రేమించలేదు అని , ఇక నాకు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు అని ,  నేను లైఫ్‌ ను సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నాను అని ,  ఎందుకంటే.. నా దృష్టిలో పెళ్లైన ఆడవాళ్లెవరూ సంతోషంగా లేరు అని ఆండ్రియా తాజాగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆండ్రియా పిశాచి 2 మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: