లైఫ్ స్టైల్: బాడీ బుల్డ్ అవడానికి ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటున్నారా..అయితే జాగ్రత్త..?
ప్రోటీన్ అనేది శరీర పెరుగుదల, నిర్వహణ కోసం అవసరమైన సూక్ష్మపోషకం. అయితే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం మంచిదికాదని, హానికరం అని పరిశోధనలు చేసి మరీ నిరూపించారు ఆరోగ్యనిపుణులు. మామూలు ఆరోగ్యకరమైన వ్యక్తులు, తక్కువ నీరు తీసుకొని,అధికప్రోటీన్ తీసుకోనేవారికి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
ప్రొటీన్ అధికంగా ఉన్న మాంసాలను తినడం ద్వారా, అధిక ప్రోటీన్ ఆహారం తీసుకునే వ్యక్తులు గుండెసంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అధికంగా ప్రాసెస్ చేయబడిన మాంసాలను తీసుకోవడం ద్వారా నైట్రోసమైన్లు క్యాన్సర్కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఏదైనా విపరీతమైన ఆహార అలవాట్లు ఉంటే శరీరఆరోగ్యం తప్పక దెబ్బతింటుంది.
బరువు తగ్గాలనుకునే వారు తమ కావాల్సిన దానికంటే రెట్టింపు ప్రొటీన్ల ఆహారం తీసుకుంటూ వుంటారు. దీనివల్ల అధిక యూరిక్ యాసిడ్ ప్రమాదం కలిగి, కిడ్నీలు దెబ్బతింటాయి.ఆహారంలో తక్కువ ఫైబర్, ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడంవల్ల శరీరం మలబద్ధకానికి గురవుతుంది.గుడ్డులోని తెల్లసొన, కొవ్వు తీసిన పాల ఉత్పత్తులు, మజ్జిగ, పెరుగు, పనీర్,సోయా, చేపలు లేదా పౌల్ట్రీ వంటి సన్నని మాంసాలు, పప్పుధాన్యాలు, కాయధాన్యాలు మరియు విత్తనాలు వంటి తీసుకోవటం ఉత్తమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.
అధిక ప్రోటీన్ ఆహారంలోని ప్యూరిన్లు గౌట్ను పెంచుతాయి. తీవ్రమైన కీళ్లనొప్పులకు దారితీస్తుంది. డయాబెటిక్ రోగులలో అధికప్రోటీన్ కల ఆహారం కిడ్నీవ్యాధి ముప్పును మరింత పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కావున ఏదయినా డైట్ తీసుకునేటప్పుడు ఆరోగ్యనిపుణుల సూచనలను పాటించడం మంచిది.