రష్మిక కి ఈ సారైనా కలిసొచ్చేనా!!

P.Nishanth Kumar
రష్మిక మందన హీరోయిన్ గా ఇప్పుడు పలు భాషలలో సినిమాలు రూపొందుతున్నాయి. తెలుగులో అగ్ర హీరోయిన్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు ఒక సినిమా లేకపోయినా కూడా భవిష్యత్తులో మంచి సినిమా అవకాశాలు రావడం ఖాయం. ఎందుకంటే అగ్ర హీరోయిన్ లు చాలా తక్కువ మంది ఉండడంతో అందరికీ ఆప్ష న్ గా ఇప్పుడు రష్మిక మందన కనిపిస్తుంది. అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలలో కూడా పెద్ద హీరోలతో కలిసి నటిస్తూ ఉండడం ఆమెకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ లో కూడా ఆమె పాగా వేయాలని అనుకోవడం విశేషం. ఆమె అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. గతంలో కార్తీతో కలిసి సుల్తాన్ అనే సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా ఏ మాత్రం కలిసి రాకపోవడంతో మరొక సినిమాతో విజయాన్ని అందుకోవాలని భావించింది. అందుకే విజయ్ దళపతి తో కలిసి ఆమె వారసుడు అనే సినిమాను చేసింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  తమిళనాడులో నెంబర్ వన్ హీరోగా ఉన్నా ఈ హీరోతో కలిసి సినిమా చేస్తే నిజంగా ఆమెకు మంచి అవకాశాలు రావడం ఖాయం అని చెప్పవచ్చు. 

తొందరలోనే ఈ సినిమా యొక్క ఫలితము రాబోతున్న నేపథ్యంలో అందులో ఆమె పాత్ర కనుక మంచిగా ఉంటే తప్పకుండా మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు. ఇప్పటికే కొంతమంది యువ హీరోలు ఆమెతో కలిసి నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు నిర్మాత అయిన దిల్ రాజు రూపొందించాడు.  మరి ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇది ఏ స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే రష్మిక తెలుగు లో పుష్ప 2 లో హీరోయిన్ గా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: