నాగార్జున పేరు మారుతోందా ?

Seetha Sailaja
నాగార్జున ను అతడి అభిమానులు కింగ్ నాగార్జున వెండితెర మన్మధుడు అంటూ అభిమానంగా పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు నాగ్ పేరు మారి నెట్ ఫ్లిక్స్ కింగ్ గా మారుతోందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికికారణం నాగ్ సినిమాలు ధియేటర్లలో కంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్నప్పుడు బాగా చూస్తున్నారు.


గత సంవత్సరం నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీ ధియేటర్లలో పెద్దగా కలక్షన్స్ రాబట్టలేక పోయినప్పటికీ ఆమూవీని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయినప్పుడు విపరీతంగా చూశారు. ఇక లేటెస్ట్ గా ఈమధ్య దసరా రేస్ కు విడుదలై ఘోరమైన ఫ్లాప్ గా మారిన నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీని మళ్ళీ నెట్ ఫ్లిక్స్ లో జనం విపరీతంగా చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి.  దీనితో నాగార్జున సినిమాలను జనం ధియేటర్లలో కంటే ఓటీటీ లలో బాగా చూస్తారా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.


వాస్తవానికి ‘సోగ్గాడే చిన్నినాయన’ తరువాత నాగార్జున సినిమాలు ఒక్కటి కూడ హిట్ కాలేదు. ఆమధ్య సంక్రాంతికి వచ్చిన ‘బంగార్రాజు’ మూవీ రిజల్ట్ కూడ అంతంత మాత్రంగానే వచ్చింది. దీనితో బుల్లితెర పై ప్రసారం అవుతున్న ‘బిగ్ బాస్’ షో లేకుంటే నాగార్జున ను మరింత మర్చిపోయి ఉండేవారా అన్న అభిప్రాయాలు కూడ కొందరికి  ఉన్నాయి.


నాగార్జున తన 100వ సినిమా గురించి చాల సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. ఎలాంటి సినిమాను చేస్తే ప్రేక్షకులు ఇష్టపడతారో తెలియక రకరకాల కథలు వింటూ తన 100వ సినిమా గురించి తెగ ఆలోచిస్తున్నట్లు టాక్. ఇదిచాలదు అన్నట్లుగా నాగచైతన్య అఖిల్ ల కెరియర్ ఇంకా పూర్తిగా సెటిల్ కాకపోవడం నాగార్జునకు బయటకు చెప్పుకోలేని బాధగా ఉంది అన్నఅభిప్రాయాలను కొందరు వ్యక్త పరుస్తున్నారు. దీనితో నాగార్జున 100వ సినిమా ఎప్పుడు ఏ దర్శకుడి తో ప్రారంభం అవుతుంది అన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గా కొనసాగుతూ ఉండటంతో నాగ్ పరిస్థితి ఏమిటి అంటు కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: