ఎన్టీఆర్ -30 సినిమాతో బండ్ల గణేష్ కు షాక్..!!

Divya
తెలుగు ఇండస్ట్రీలో నటుడుగా, నిర్మాతగా, పవన్ కళ్యాణ్ భక్తుడుగా ఎంతో పేరు సంపాదించారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ తో చేసిన తీన్ మార్ సినిమా ఫ్లాప్ కాగా గబ్బర్ సింగ్ సినిమా మాత్రం మంచి భారీ విజయాన్ని అందించింది. వరుస పరాజయలతో ఇబ్బంది పడుతున్న సమయంలో అటు పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ చిత్రం మంచి విజయాన్ని ఇచ్చింది. అలా పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కాంబినేషన్లో మరొక సినిమా రావాలని అభిమానులు సైతం కోరుకుంటూ ఉంటున్నారు. అయితే అవకాశం కోసం బండ్ల గణేష్ ఎదురుచూస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో సినిమాలలో బిజీగా ఉండడం చేత ఏ సినిమా అని ఒప్పుకోవడం లేదు. కేవలం ఒప్పుకున్న సినిమాలే చేయలేక చాలా సతమతమవుతూ ఉన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ కోసం దేవారా అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు బండ్ల గణేష్. అయితే ఈ టైటిల్ తోనే సినిమాను ఫిక్స్ చేయాలని బండ్ల గణేష్ అనుకున్నారు. అయితే బండ్ల గణేష్ ఎన్నో ఏళ్లుగా ఈ టైటిల్ ను దాచుకున్నప్పటికీ తాజాగా ఎన్టీఆర్ ఈ టైటిల్ని తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దేవర అనే టైటిల్ ని చాంబర్లో రెన్యువల్ చేయడం బండ్ల గణేష్ మర్చిపోయారట. దీంతో ఎన్టీఆర్ తన 30 వ సినిమాకు దేవర అనే టైటిల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ విషయం మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ విషయంపై ఎలాంటి అధికారికంగా సమాచారం లేదు. కానీ ఈ విషయం మాత్రం బండ్ల గణేష్ కు ఒక షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ చాలా స్టైలిష్ లిక్ లో ఉన్న ఒక ఫోటో వైరల్ గా మారుతోంది. మరి ఈ విషయంపై చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంపై బండ్ల గణేష్ కూడా ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: