చిరంజీవి రీఎంట్రీ తరవాత వరుస సినిమాలకు కమిట్ అవుతూ అబిమానులను ఫుల్
ఖుషీ చేస్తున్నాడు.ఇక భారీ అంచనాలతో వచ్చిన "
సైరా నరసింహారెడ్డి " ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. ఇక ఆ తరువాత
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన " ఆచార్య " డిజాస్టర్ గా నిలిచింది. ఆచార్య తరువాత ఇటీవల "
గాడ్ ఫాదర్ " తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగాస్టార్. ఇక ఈ
మూవీ కూడా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదనే చెప్పాలి. మూవీలో
మెగాస్టార్ కనిపించిన విధానానికి ఫ్యాన్స్
ఫిదా అయ్యారు. .అయితే మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి
జనాలను
థియేటర్ కు రప్పించడంలో చిత్రయూనిట్ విఫలం అయిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇక మూవీ విడుదల దగ్గర ఉన్నప్పటికి చిత్రయూనిట్
గాడ్ ఫాదర్ విషయంలో ప్రమోషన్స్ పై పెద్దగా ఆసక్తి కనబరచలేదు.ఇక దీంతో మూవీకి రావాల్సిన హైప్ రాకపోవడం వల్లే లాంగ్ రన్ లో భారీ వసూళ్లను
గాడ్ ఫాదర్ రాబట్టలేక పోయిందని సినీ విశ్లేషకుల అభిప్రాయం.ఇదిలావుంటే ఇక తన నెక్స్ట్
మూవీ విషయంలో ఈ పొరపాటు జరగుండా చూసుకుంటున్నాడు మెగాస్టార్.అయితే తన తరువాతి
మూవీ " వాల్తేరు వీరయ్య "
మూవీ ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.
ఇక మూవీ ప్రారంభం అయినది మొదలుకొని ఏదో ఒక అప్డేట్ తో హంగామా చేస్తూనే ఉన్నారు చిత్రయూనిట్.అయితే ఇటీవల మూవీకి సంబంధింకిన టీజర్ రిలీజ్ చేయగా, అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేసేందుకు సిద్దమౌతున్నారట చిత్రయూనిట్. అయితే ఇప్పటికే మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా మ్యూజిక్
డైరెక్టర్ దేవిశ్రీ
ప్రసాద్ చేశారట.కాగా ఈ
మూవీ వచ్చే ఏడాది
సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుండడంతో.. ఇక రిలీజ్ కు ఓ నెల ముందు నుంచే
మూవీ సాంగ్స్, ఇంటర్వ్యూ లతో " వాల్తేరు వీరయ్య " టీం హంగామా చేయనున్నారట. ఇక ఏది ఏమైనప్పటికి
గాడ్ ఫాదర్ విషయంలో జరిగిన తప్పును " వాల్తేరు వీరయ్య " మూవీతో సరిదిద్దుకుంటున్నారు చిరు..!!