వామ్మో: సమంత క్రేజ్ చూసి తలలు పట్టుకుంటున్న హీరోయిన్స్..!!

Divya
టాలీవుడ్ లో సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రేజ్ తోనే ఈ ముద్దుగుమ్మ అన్ని భాషలలో నటించడానికి ప్రస్తుతం సినిమాలను ఓకే చేస్తూ ఉంది. తాజాగా తన నటించిన యశోద సినిమా థియేటర్లోకి ఈ రోజున విడుదలైంది. ఇక గత సంవత్సరం పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో నటించి పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది సమంత. సరోగసి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న యశోద చిత్రంతో లేడీ ఓరియంటేడ్ గా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ చిత్రాన్ని హరి హరీష్ దర్శకత్వం వహించారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు ప్రమోషన్స్ కూడా ఈ సినిమా అంచనాలను పెంచేసాయి.తాజాగా సమంత కటౌట్ ల గురించి తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది ఈ విషయం. సాధారణంగా ఎవరైనా పెద్ద హీరోలకు మాత్రమే అభిమానులు ఇలా థియేటర్ల వద్ద భారీ కటౌట్లను ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ సమంతకు కూడా ఇలాంటి భారీ కటౌట్లు ఏర్పాటు చేయడంతో ఈమె అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాదులో సుదర్శన్ థియేటర్ వద్ద సమంత భారీ కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేశారు.

ఇక 2019వ సంవత్సరంలో ఓ బేబీ సినిమా విడుదల సమయం ముందు కూడా సమంత కటౌట్ థియేటర్ల వద్ద భారీగానే ఏర్పాటు చేశారు అభిమానులు.అయితే తెలుగు రాష్ట్రాలలో యశోద సినిమా కూడా అన్ని థియేటర్లలో విడుదలబోతున్న సందర్భంగా కొన్నిచోట్ల సమంతా కటౌట్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా సమంత క్రేజీ చూసి ఇతర హీరోయిన్లు కూడా కాస్త జలసీగా ఫీల్ అవుతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి సమంత యశోద చిత్రంతో సక్సెస్ అందుకుంటున్న లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక సమంత ఖుషి, శాకుంతలం సినిమాలు విడుదల కావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: