ఆ సినిమా వల్లే నేనేంటో నాకు తెలిసింది.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..!?

Anilkumar
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. అయితే ఇక  ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి ఆశించిన స్థాయిలో వసూల్లు రాబట్టలేకపోయింది.ఇక పాన్ ఇండియా లెవల్లో విజయ్ క్రేజ్ మాత్రం పెరిగిపోయింది.అయితే  రౌడీ యాటిట్యూడ్.. స్టైల్‏కు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఇక  ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ  ‏కు బీటౌన్ నుంచి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇకపోతే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన లైగర్ తో పాన్ ఇండియా స్టార్ హీరోగా

 స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ . అయితే ఇక  తాజాగా లైగర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ .కాగా ఆదివారం ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ ..లైగర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక తాను మళ్లీ తిరిగి రావాలని అభిమానులు ప్రతిసారి అడుగుతున్నారని.. వారు అనుకుంటున్నట్లుగా తాను ఎక్కడికి వెళ్లలేదని.. ప్రస్తుతం ఇక్కడే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ  మాట్లాడుతూ.. లైగర్ ఒక నటుడిగా.. వ్యక్తిగా తానేంటో తనకు చూపించిందన్నారు.ఇక  ఈ సినిమా ద్వారా విలువైన పాఠం నేర్చుకున్నట్లు తెలిపారు.

ఇక ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ .. డైరెక్టర్ శివ నిర్మాణంలో ఖుషి చేస్తున్నారు. కాగా ఇందులో టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత కథానాయికగా నటిస్తోంది. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఇక సామ్ ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుండడంతో ఈ మూవీ విడుదల మరింత ఆలస్యం కానున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఇదే కాకుండా మాస్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ జనగణమన చిత్రం చేయాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: