టాలీవుడ్
ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న
యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన
మూవీ లలో హీరోగా నటించి , ఎన్నో విజయాలను
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ
హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నిఖిల్ తాజాగా
కార్తికేయ 2 అనే
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి టాలెంటెడ్
డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించగా , మోస్ట్
బ్యూటిఫుల్ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటించింది.
శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్ష ఈ
మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ
మూవీ మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే
థియేటర్ లలో విడుదల అయింది. ఈ
మూవీ కి దేశవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు లభించాయి. దానితో
కార్తికేయ 2
మూవీ ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ
సినిమా మరి కొద్ది రోజుల్లోనే బుల్లి తెర పేక్షకులను అల్లరించడానికి రెడీ అయింది.
ఈ
మూవీ హిందీ వర్షన్ సాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. జి సంస్థ ఈ
సినిమా హిందీ వర్షన్ ను జీ సినిమాలో
నవంబర్ 27, 2022 న రాత్రి 8 గంటలకు ప్రసారం చేయనుంది. ఈ
సినిమా తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను కూడా జీ సంస్థ దక్కించుకుంది. ఈ
సినిమా తెలుగు వర్షన్ ను కూడా
నవంబర్ 27, 2022 న రాత్రి 8 గంటలకు ప్రసారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.