అర్జున్ తో వివాదం.. విశ్వక్ కెరీర్ కి ముప్పు?

Purushottham Vinay
దేశం గర్వపడే నటులలో సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూడా ఒకరు. ఆయన సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి నటుడు కూడా ఆయనతో ఒక్కసారైన పని చెయ్యాలని అనుకుంటాడు. ఇక ఆయన దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఇంకా అర్జున్ కూతురు ఐశ్వర్య సర్జా హీరో హీరోయిన్లుగా ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా లాంచ్ చేసారు. అయితే ఈ సినిమా విషయంలో అర్జున్ కు విశ్వక్ సేన్ కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు న్యూస్ బాగా వైరల్ అయ్యింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఈ సినిమా షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకోమని విశ్వక్ సేన్ మెసేజ్ చేసిన నేపథ్యంలో.. దర్శకుడు అర్జున్ శనివారం మీడియా ముందుకు వచ్చి తన బాధని చెప్పుకున్నాడు.దీనిపై విశ్వక్ సేన్ కూడా అర్జున్ కి సారీ చెపుతూ స్పందించాడు.



అయితే అర్జున్ సినిమా నుంచి ఎగ్జిట్ అయినంత మాత్రాన విశ్వక్ సేన్ కి అవకాశాలు అయితే తగ్గవు కానీ ఇలాంటి వివాదాలే మరోసారి రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా అతని కెరీర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. యంగ్ హీరోగా మంచి సినిమాలతో దూసుకెళ్తున్న విశ్వక్ సినిమాల విషయంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే  ఖచ్చితంగా ఫ్యూచర్ లో మంచి పొజిషన్ లో ఉంటాడు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. అది అందరికి ఉంటుంది.కానీ దాన్ని సరైన రీతిలో ఉపయోగిస్తేనే ఎవరైనా స్టార్స్ అవుతారు. ఇలా అనవసరమైన పరిస్థితులకు దారి తీస్తే కెరియర్ లో బాగా వెనకపడే అవకాశం ఉంటుంది. విశ్వక్ సేన్ ఈ విషయంపై చాలా సీరియస్ నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. లేదంటే అతని కెరియర్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మరి చూడాలి విశ్వక్ సేన్ తన యాటిట్యూడ్ మార్చుకొని ముందుకు వెళతాడో లేడో అనేది.రీసెంట్ గా "ఓరి దేవుడా" తో మెప్పించి మరీ అంత పెద్ద హిట్ కొట్టకపోయినా ఓ మోస్తారు హిట్ కొట్టి సేఫ్ అయ్యాడు. ఇక చూడాలి భవిష్యత్తులో అతని నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: