హీరోయిన్ మీనాతో ముద్దు సీన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య..!?

Anilkumar
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్స్టాపబుల్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో భారీగా ప్రేక్షకాధరణ దక్కించుకుంటూ రికార్డు స్థాయిలో వ్యూస్ ని రాబడుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.ఇక ప్రస్తుతం రెండవ సీజన్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మొదటి ఎపిసోడ్ కి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ రాగా రెండవ ఎపిసోడ్ కి విశ్వక్ సేన్ సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. మూడవ ఎపిసోడ్ కి మరొక ఇద్దరు యంగ్ హీరోలు హాజరయ్యారు. ఇక ఎవరో కాదు శర్వానంద్, అడవి శేష్.ఇదిలావుంటే  ఈ క్రమంలోనే బాలకృష్ణ తన మాటలతో ఇద్దరు యంగు హీరోలను ఒక ఆట ఆడుకున్నాడు.

అంతేకాదు మధ్య మధ్యలో శర్వానంద్ కూడా బాలకృష్ణ సీక్రెట్ చెప్పడానికి ప్రయత్నించగా బాలయ్య బాబు వద్దు అంటూ ఫన్నీగా స్పందించారు. ఇక ఈ క్రమంలోనే వారితో కలిసి పలు ఆటలు ఆడించడం మాత్రమే కాకుండా అనేక రకాల ప్రశ్నలకు సమాధానాలు కూడా రాబట్టాడు. అయితే ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ ఆ ఇద్దరి హీరోలతో రాపిడ్ ఫైర్ ఆట ఆడిస్తూ నువ్వు ఫస్ట్ కిస్ చేసిన హీరోయిన్ ఎవరు అని అడవి శేష్ ని బాలయ్య ప్రశ్నించగా క్షణం సినిమాలో అదా శర్మ అని చెప్పాడు.ఇకపోతే  చివరికిస్ అనగా హిట్ 2 సినిమాలో మీనాక్షి చౌదరి అని చెప్పాడు శేష్.ఇక  ఎవరిని ముద్దు పెట్టుకోవాలని ఉంది అనటంతో కత్రినా కైఫ్ అని చెప్పాడు.

అయితే ఆ తర్వాత శర్వానంద్ ని ప్రశ్నిస్తూ నువ్వు ముద్దు ఎవరికి ఇస్తావమ్మ అని బాలయ్య అడగగా నేను ఏ అమ్మాయి ఇస్తాను అన్న వద్దనను సార్ అంటూ కామెడీగా పంచులు వేసి నవ్వించాడు శర్వానంద్. ఇక అప్పుడు బాలకృష్ణ ఒక సన్నివేశం గురించి చెబుతూ బొబ్బిలి సింహం సినిమా షూటింగ్ సమయంలో మీనా తో జరిగిన కిస్ సీన్ గురించి తెలిపాడు. ఇకపోతే బొబ్బిలి సింహం పిక్చర్ ఓపినింగ్. వేమూరు గుట్టపైన. ఇక పక్కనే రజినీకాంత్ గారు, మీనా గారు షూటింగ్ చేస్తున్నారు. అయితే అక్కడి నుంచి వాళ్లు నా సినిమా ఓపెనింగ్ వచ్చారు. ఎందుకంటే,  ఇక మీనా నా సినిమాలోనూ ఉంది. నేను చెప్పేది సీరియస్ డైలాగ్.అయితే  దాని తరవాత ఔట్ ఫీల్డ్ నుంచి ఆవిడను వచ్చి నా బుగ్గ మీద ముద్దుపెట్టమన్నారు.కాగా  రజినీకాంత్ గారు క్లాప్ కొట్టారు...డైలాగ్ అయిపోయింది. ఇక మీనా ఔట్ ఫీల్డ్ నుంచి వచ్చింది....ఆవిడ రావడం లేటైంది....ఏంట్రా ఇంకా రాలేదు అని అటు తిరిగా అప్పుడు లిప్ లిప్ దగ్గరకి రావడతో ఆమె కెవ్వుమని అరిచింది అని చెప్పుకొచ్చాడు బాలయ్య బాబు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: