అందుకే కాజల్ అగర్వాల్ తన బిడ్డని చెల్లికి అప్పగించిందా..!!
అయితే కాజల్ చాలా రోజులు విరామం తర్వాత మళ్లీ ఇటీవలే షూటింగ్లో పాల్గొంటుంది. ఎప్పటిలాగానే హీరోయిన్గా బిజీగా మారడానికి ప్రయత్నిస్తోంది. ఈమె బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ డైట్ మెయింటైన్ చేయడానికి మునుపటిలా అందంగా కనిపించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కమలహాసన్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ -2 సినిమాలో కూడా నటిస్తోంది మరొకవైపు బిడ్డతో తమ సమయాన్ని గడుపుతూనే సినిమాల షూటింగ్లో చాలా బిజీగా ఉంటుంది కాజల్ అగర్వాల్. అలాగే మరొక సరికొత్త సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నది.
ఇక ఈమె షూటింగ్గులతో బిజీగా ఉండడంతో తన బేబీని క్యారీ చేయలేకపోతుందని.. ఈమె షూటింగ్ కోసం చెన్నైలో ఉండగా.. అందుకోసం వెళ్లి రావడం చాలా ఇబ్బందిగా ఉండడంతో ఇండియన్ -2 సినిమా పూర్తి అయ్యేవరకు ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి తన కుమారుడి బాధ్యతను తన చెల్లికి నిషా అగర్వాల్ కి అప్పగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిషా అగర్వాల్ ప్రస్తుతం తన అక్క కొడుకును చూసుకుంటూ బిజీగా ఉన్నది. ఇక అలాగే కాజల్ తల్లి కూడా వీరితోపాటు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో కూడా ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది కాజల్ అగర్వాల్. త్వరలోనే ఒక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.