చిరంజీవి సినిమా స్టోరీ లీక్..రవితేజ ఫైర్..

Satvika
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.. మొన్నీమధ్య గాడ్‌ఫాదర్‌ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు..Mega 154 మూవీగా మెగాస్టార్ చిరంజీవి, కెస్.రవీంద్రా అలియాస్ బాబీ కాంబోలో వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.


సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న ఈ సినిమాలో చాలా సర్ ప్రైజులు ఉన్నయని తెలుస్తుంది. చిరు 154లో మాస్ మహరాజ్ రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో రవితేజకి కూడా మంచి రోల్ దక్కిందట. అయితే ఈ సినిమాలో మరోసారి రవితేజ చిరంజీవి తమ్ముడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు వాల్తేరు వీరయ్య కథ ఇదే అంటూ ఒక స్టోరీ లైన్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ కథ ఏంటి అంటే.. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన తమ్ముడిని తప్పుడు కేసులో ఇరికించి జాబ్ పోయేలా చేస్తారు.


ఆ టైం లో అన్నయ్య అదే మన వాల్తేరు వీరయ్య ఎంటర్ అయ్యి తమ్ముడి ప్రాబ్లెం సాల్వ్ చేస్తాడట. అంతేకాదు అతన్ని చీ కొట్టిన వారి చేతే శభాష్ అనిపిస్తాడట. ఈ కథ దాదాపు తెలుగులో వచ్చిన రివెంజ్ స్టోరీల్లా అనిపిస్తున్నా.. రవితేజ, చిరంజీవి కాంబో కాబట్టి తప్పకుండా సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు.. అన్నయ్య సినిమాలో చిరు తమ్ముడిగా నటించిన రవితేజ ఇప్పుడు మాస్ మహరాజ్ గా క్రేజ్ తెచ్చుకున్నాక వారి మధ్య సీన్స్ ఎలా ఉండబోతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. బాబి మాత్రం ఈ సినిమా అటు మెగా ఫ్యాన్స్ కి ఇటు మాస్ రాజా ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇచ్చేలా చేస్తాడని అంటున్నారు. ఆల్రెడీ రవితేజతో పవర్ అంటూ ఓ హిట్ ఇచ్చిన బాబీ వాల్తేరు వీరయ్యతో ఆ హిట్ మేనియాని మరింత పెంచేలా చేయాలని ఫిక్స్ అయ్యాడు.మెగా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు...మరి ఎలాంటి వసూల్లను రాబడుతుందొ చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: