ట్రోలింగ్ కి గురవుతున్న అల్లు శిరీష్.. కారణం..?

Divya
యువ హీరో అల్లు శిరీష్ దాదాపుగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. అయితే గడిచిన మూడు సంవత్సరాల నుంచి ఈ హీరో నుంచి ఏ సినిమా కూడా విడుదల కాలేదు. ఇప్పుడు తాజాగా ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రేపటి రోజున ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో జోరుగా సినిమా ప్రమోషన్స్ ను చేస్తూ ఉన్నారు చిత్ర బృందం. అయితే ఇందులో భాగంగా అల్లు శిరీష్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ని ఎడిట్ చేసి ఒక వర్గం నేటిజన్స్ సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేస్తూ ఉన్నారట.


అల్లు శిరీష్ గతంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. మెగా హీరోలను టార్గెట్ చేసే పోస్టులకు సైతం స్పందించడానికి వెనుకాడే వారు కాదు.ఈ సమయంలో ఒక వర్గం నేటిజెన్ల నుంచి అతను చాలా నెగిటివ్ ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు అల్లు శిరీష్ లో యాక్టివిటీలో పూర్తి చేంజ్ వచ్చిందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఏదైనా అవసరం ఉంటే తప్ప తరచుగా ఉపయోగించడం లేదు అల్లు శిరీష్. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యువ హీరో అని పేర్కొన్నాడు.


దీంతో ట్రోలింగ్ను కూడా పట్టించుకోవడం మానేశానని ప్రశాంతంగా ఉండడానికి అలవాటు చేసుకుంటున్నానని తెలియజేశారు అల్లు శిరీష్. ఇటీవల ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రమోషన్లలో భాగంగా కాలేజీలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ఉపయోగిస్తూ శిరీష్ పై అతని కుటుంబ సభ్యులపై అసహనమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే హీరోల పైన ట్రోలింగ్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. కుటుంబాన్ని కూడా అందులోకి లాగడం అనేది చాలా అసహ్యకరమని చెప్పవచ్చు. కేవలం కొంతమంది హీరోల ఫ్యాన్స్ దిగజారి ఇలా కుటుంబాలపై  అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ప్రేక్షకులు భావిస్తూ ఉన్నారు. ఈ సినిమాతో నైనా అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ కెరియర్ మారుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: