ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఆ డైరెక్టర్ తో నేనా?

Satvika
రాజమౌలి ఇటీవల తెరకెక్కించిన త్రిపుల్ ఆర్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా సినిమాగా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. అయితే ఇప్పుడు జపాన్ లో కూడా విడుదలై కలెక్షన్ల వర్షం కురుస్తోంది.. అయితే ఈ సినిమా నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పాన్ ఇండియా హీరోలు అయ్యారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో సినిమాను చేస్తున్నారు. మాస్ డైరెక్టర్ కావడం తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్థి గా చూస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన ఈ మూవీ పోస్టర్ ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ రాబోతుందని.. ఇందులో తారక్ మరింత పవర్ ఫుల్ లుక్‏లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ తర్వాత ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ గురించి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ తారక్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం లో ఓ చేస్తున్నారట.

 ఇప్పటికే హను.. ఎన్టీఆర్ కు స్క్రిప్ట్ వినిపించారు అని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వీరి కాంబో అప్డేట్ అఫీషియల్ అనౌన్స్ చేయనున్నారట. ఇక ఇటీవల సీతారామం తో సూపర్ హిట్ అందుకున్న హను.. ఇప్పుడు ఎన్టీఆర్‏తో చేస్తుండడంతో అభిమానుల లో క్యూరియాసిటిని పెంచేసింది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తో చేస్తున్నారు. ఇప్పటికీ ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇటీవల ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా జపాన్‏ లో సందడి చేసిన సంగతి తెలిసిందే.. ఇక కొత్త సినిమాను ఎప్పుడూ పట్టాలెక్కిస్తారొ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: