ఇండియన్ బాక్సాఫీస్ ని బాగా దడదడలాడించిన
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్
మూవీ 'ఆర్ఆర్ఆర్'
సినిమా ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.ఇప్పటికే ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాను చూస్తూ, గ్లోబల్ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క కొన్ని దేశాల్లో ఈ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ వేసి మరీ ఆడియెన్స్ చేత ఔరా అనిపిస్తున్నారు. అయితే ఇటీవల
ఆర్ఆర్ఆర్ సినిమాను
జపాన్ దేశంలో భారీ స్థాయిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.జపాన్లో
ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం చిత్ర యూనిట్ అక్కడ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా చేసింది. దీంతో ఈ సినిమాకు అక్కడ భారీగా హైప్ తీసుకొచ్చారు. ఇక ఆర్ఆర్ఆర్కు జపాన్లో వస్తున్న రెస్పాన్స్ చూసి మరో స్టార్
హీరో కూడా తన సినిమాను అక్కడ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అతడు మరెవరో కాదు..
తమిళ స్టార్
హీరో విజయ్. ఆయన నటించిన 'మాస్టర్'
మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ
సినిమా ప్రేక్షకులను అలరించడంలో హిట్ అయ్యింది.అందువల్ల ఇక ఈ సినిమాను ఇప్పుడు
జపాన్ దేశంలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను
నవంబర్ 18న
జపాన్ దేశంలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాకు అక్కడ ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే ఈ
సినిమా జపాన్ దేశంలో రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.జపాన్ లో ఇప్పటికీ కూడా ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ముందంజలో వుంది. ఆ సినిమాని పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలే దాటలేకపోతున్నాయి. ఇక
విజయ్ మాస్టర్ సినిమా దాటుతుందో లేదో చూడాలి.డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ
సినిమా జపాన్లో ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.