సూర్య 42వ సినిమా వాయిదా పడనుందా..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సూర్య ,  మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గజినీ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. గజినీ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న సూర్య అప్పటి నుండి తాను నటించిన దాదాపు ప్రతి మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో భాగంగా సూర్య నటించిన కొన్ని సినిమాలు తెలుగు లో కూడా అద్భుతమైన విజయాలను సాధించాయి.


దానితో సూర్య ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ను సృష్టించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం సూర్య ,  లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వం లో తెరకెక్కిన విక్రమ్ మూవీ లో అతిధి పాత్రలో నటించాడు. ఈ మూవీ లో సూర్య నటించినది తక్కువ నిడివి ఉన్న పాత్ర అయినప్పటికీ , ఈ పాత్ర కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య తన కెరీర్ లో 42 వ మూవీ గా తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శివ దర్శకత్వం వహిస్తున్నాడు.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ని 2023 వ సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ ని 2023 వ సంవత్సరంలో విడుదల చేయడం లేదు అని , ఈ మూవీ ని 2024 వ సంవత్సరంలో విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉంది అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: