మంచు విష్ణు సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. మంచు విష్ణు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్‌లో ఎంతో సరదాగా ఉంటాడు. కొన్ని సార్లు తన మీద వచ్చే ట్రోలింగ్‌ను ఎంతో సరదాగా తీసుకుంటూ ఉంటాడు. తన ఫ్యామిలీ వచ్చే ట్రోలింగ్ పట్ల మాత్రం సీరియస్ అవుతుంటాడు. తన మీద జరిగే తప్పుడు ప్రచారాన్ని కూడా అదే స్టైల్లో తిప్పి కొడుతుంటాడు. తప్పుడు వార్తలంటూ ఖండిస్తుంటాడు. తాజాగా మంచు విష్ణు జిన్నా అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.జిన్నా సినిమాలో మంచు విష్ణు కాస్త కొత్తగా కనిపించాడు. ఇది వరకంటే ఎక్కువే స్టెప్పులు వేశాడు. ఓ మోస్తరుగా మెప్పించాడు. కానీ మంచు వారి సినిమాల మీద జనాలకు అంతగా ఇంట్రెస్ట్ లేనట్టుగా కనిపిస్తోంది. జిన్నా సినిమాకు కనీస వసూళ్లు కూడా రావడం లేదు. సినిమాను థియేటర్లోంచి ఎత్తేస్తున్నారు. కనీసం పది టికెట్లు కూడా తెగడం లేదని షోలను క్యాన్సిల్ చేస్తున్నారు.ఇక జిన్నా కలెక్షన్ల మీద వచ్చే ట్రోలింగ్స్ అన్నీ ఇన్నీ కావు. ఓవర్సీస్‌లో అయితే కనీసం రెండు వేల డాలర్లు కూడా సంపాదించలేకపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే కనీసం కోటి షేర్ కూడా రావడం లేదు. ఇక సినిమాల సంగతి అలా ఉంటే.. సోషల్ మీడియాతో మాత్రం మంచు విష్ణు ఫుల్ జోరు మీదున్నాడు. తాజాగా ఆయన వేసిన నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టేశారు.
ఇది వరకు మంచు విష్ణు గుబురు గడ్డంతో ఎంతో స్టైలీష్‌గా కనిపించారు. జిన్నా కోసం మళ్లీ లుక్ మార్చేశాడు. అయితే తిరిగి మళ్లీ ఆ గుబురు గడ్డం లుక్ కోసం ట్రై చేయాలని అనుకుంటున్నాడట. దీని కోసం ఇంట్లో పర్మిషన్ ఇవ్వడం లేదట.. హోం డిపార్ట్మెంట్ ఒప్పుకోవడం లేదని తన భార్య గురించి ఇలా పరోక్షంగా చెప్పుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. హోం డిపార్ట్మెంట్ మార్చేసేయ్ అన్నా.. హోం డిపార్ట్మెంట్‌లో సన్నీ ఉందా? అన్నా అంటూ ఇలా నానా రకాలుగా కౌంటర్లు వేస్తున్నారు.