సామ్.. నువ్వు త్వరగా కోలుకోవాలి: ఎన్టీఆర్

Purushottham Vinay
టాలీవుడ్  స్టార్  హీరోయిన్  సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంటూ చికిత్స తీసుకుంటున్న ఓ ఫోటోను ఇవాళ సోషల్ మీడియాలో షేర్‌ చేసి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ప్రకటనతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా సమంత త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేశారు.జూనియర్ ఎన్టీఆర్ ట్విటర్‌లో రాస్తూ..' త్వరగా కోలుకోవాలి సామ్.. నీకు ఆ ధైర్యాన్ని పంపుతున్నా' అంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌తో సమంతకు ఫస్ట్  నుంచి కూడా మంచి అనుబంధం వుంది. ఇద్దరూ కూడా చాలా సినిమాల్లో నటించారు. అంతే గాక సామ్  అందరి హీరోల కంటే ఎక్కువగా ఎన్టీఆర్ తోనే కలిసి నటించింది. వీరిద్దరూ కూడా కలిసి జనతా గ్యారేజ్‌, రామయ్య వస్తావయ్యా, బృందావనం, రభస లాంటి పలు చిత్రాల్లో  నటించి ఆన్   స్క్రీన్  మీద బెస్ట్  పెయిర్  అనిపించుకున్నారు.



నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సమంత చాలా డల్  అయిపోయింది. ఆ బాధని మర్చిపోడానికి రకరకాల హాట్  ఫోటో షూట్లు కూడా చేసింది.ఇటీవల ఆమె ఆరోగ్యంపై రకరకాల రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. తాజాగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోను షేర్‌ చేయడంతో వాటికి తెరపడింది. ఈ వ్యాధి వచ్చిన వారికి కండరాల బలహీనత, ఎక్కువసేపు నిల్చోలేకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధికి చికిత్స చెయ్యడం కూడా కష్టమే అంటున్నారు. ఎందుకంటే ఇది అరుదైన వ్యాధి. కానీ సమంత కోలుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుంది. సమంత త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ తో పాటు రాశి ఖన్నా, మంచు లక్ష్మి, బాలీవుడ్  హీరోయిన్స్  కియారా అద్వానీ, జాన్వీ కపూర్  కూడా కామెంట్ చేశారు. అభిమానులు కూడా సమంత త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: