కళ్యాణ్ రామ్ బింబిసార 2 లేటెస్ట్ అప్డేట్....!!
ఈ సినిమా తర్వాత ఈయన నెక్స్ట్ సినిమా ఏంటి అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరిగింది.టాలీవుడ్ కష్టకాలంలో ఉంటే బింబి సార సినిమా ఊపిరి పోసింది.మరి అలాంటి అనూహ్య విజయం అందుకోవడంతో టీమ్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.ఇక ఈ సినిమా ప్రొమోషన్స్ సమయంలోనే దీనికి సీక్వెల్ ఉంటుంది అని కళ్యాణ్ రామ్ ప్రకటించాడు.
అన్నట్టుగానే ఈ సినిమాకు సీక్వెల్ పనులు శరవేగంగా జరుగు తున్న.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఇక తాజాగా ఈ సినిమా నుండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగాయి.ప్రెజెంట్ మల్లిడి వసిష్ఠ సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ వర్క్ మీద పని చేస్తూన్నాడు.బింబిసార సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు.
కళ్యాణ్ రామ్ ఇతర కమిట్ మెంట్స్ కారణంగా వచ్చే ఏడాది జూన్-జులై నాటికీ తమ షూట్ స్టార్ట్ చేస్తామని తెలిపాడు.మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో మా మీద ఒత్తిడి బాగా ఉందని అన్నారు.
ఇది పార్ట్ 1 కు అనుబంధం కలిగి ఉంటుంది అని కూడా తెలిపాడు.దీంతో వచ్చే ఏడాది బింబిసార 2 స్టార్ట్ అవ్వబోతుంది అని తెలుస్తుంది.