12 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో "కాంతారా" మూవీ సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
సెప్టెంబర్ 30 వ తేదీన కన్నడ భాషలో కాంతారా అనే మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా కాంతారా మూవీ కన్నడ భాషలో అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ ని అక్టోబర్ 15 వ తేదీన తెలుగు భాషలో కూడా విడుదల చేశారు. తెలుగు భాషలో ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై విడుదల చేశాడు. కన్నడ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మొదటి నుండే భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 15 వ తేదీన తెలుగు లో విడుదల అయిన ఈ మూవీ తెలుగు లో కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బాస్టర్ టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు కాంతారా మూవీ తెలుగు భాషలో 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 12 రోజుల్లో కాంతారా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

 
నైజాం : 7.32 కోట్లు .
సీడెడ్ : 2.06 కోట్లు .
యు ఏ : 2.14 కోట్లు .
ఈస్ట్ : 1.30 కోట్లు .
వెస్ట్ : 84 లక్షలు .
గుంటూర్ : 1.09 కోట్లు .
కృష్ణ : 1.09 కోట్లు .
నెల్లూర్ : 67 లక్షలు .
12 రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంతారా మూవీ 16.51  కోట్ల షేర్ , 29.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: