టాలీవుడ్ యంగ్
హీరో రామ్ చివరిగా 'ది వారియర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇక ఈ
సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం రామ్..బోయపాటి దర్శకత్వంలో ఓ
సినిమా చేస్తున్నారు.ఇక హీరోగా
రామ్ 20వ చిత్రమిది (RAPO20). ఇందులో
రామ్ కి జంటగా యంగ్ సెన్సేషన్, కొత్త
హీరోయిన్ శ్రీలీల కనిపించనుంది. ఇదిలావుంటే ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు.అయితే ఈ సినిమాను
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై
పవన్ కుమార్ సమర్పణలో
శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
ఇక 'ది వారియర్' తర్వాత
రామ్ పోతినేనితో ఆయన నిర్మిస్తున్న
సినిమా ఇది. ఇక ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం
బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.కాగా ఆమె మరెవరో కాదు..
ఊర్వశి రౌతేలా. అయితే ఇప్పటికే ఆమె
బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది.ఇక అలానే ఐటెం సాంగ్స్ లో కూడా కనిపించింది.అయితే ఇప్పుడు తెలుగు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.ఇక ఇప్పటికే
సంపత్ నంది దర్శకత్వంలో 'బ్లాక్ రోజ్' అనే సినిమాలో నటించింది.అంతేకాదు త్వరలోనే ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు బోయపాటి-రామ్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది.
కాగా రామ్ తో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఊర్వశి.అయితే ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.ఇదిలావుంటే ఇక పాన్
ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ
సినిమా తెరకెక్కిస్తున్నారు.
రామ్ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేయగా... మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.ఇక బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రాలు ఇతర భాషల్లో
రీమేక్ అయ్యాయి.అంతేకాదు హిందీలో డబ్బింగ్ అయ్యాయి.అయితే ఉత్తరాది ప్రేక్షకుల్లో ఆయన సినిమాలకు డిమాండ్ ఉంది.ఇక ఇప్పుడు వీరిద్దరి కలయికలో
సినిమా అంటే కచ్చితంగా నార్త్‌లో డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు. కాగా ఊర
మాస్ కమర్షియల్ చిత్రాలు తీయడంలో, సందేశాత్మక కథలకు వాణిజ్య హంగులు జోడించి చిత్రాలు తెరకెక్కించడంలో తన శైలి ఏంటనేది
బోయపాటి శ్రీను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు.అయితే ఈ
సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని టాక్..!!