విజయ్ దేవరకొండకు వివాహమైంది అంటూ బాంబు పేల్చిన జాన్వి కపూర్..!!

Divya
టాలీవుడ్లో టాలెంటెడ్ హీరోగా పేరుపొందిన విజయ్ దేవరకొండ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక విజయ్ దేవరకొండ పైన ఉండే ప్రేమను ఎంతోమంది సెలబ్రెటీలు సైతం పలు రకాలుగా తెలియజేస్తూ ఉంటారు. ఇక ఇది వరకే విజయ్ దేవరకొండ పై క్రిష్ ఉందంటూ జాన్వి కపూర్, సారా అలీ ఖాన్ ,కియారా అద్వానీ తదితరులు తెలియజేశారు. అయితే ఇప్పటికే విజయ్తో రిలేషన్ షిప్ లో ఉన్నానని కూడా జాన్వి, సార పలుసార్లు ఇంటి ఇవ్వడం జరిగింది.

అయితే విజయ్ మాత్రం రష్మిక తో డేటింగ్ చేస్తున్నాడని ఇప్పటికే పలు వార్తలు చాలా వైరల్ గా మారాయి.ఈ విషయంపై జాన్వి కపూర్, సార అలీ ఖాన్ కూడా నమ్ముతున్నామని తెలియజేశారు తాజాగా ఒక చాటింగ్ సెక్షన్ లో జాన్వి కపూర్ మాట్లాడుతూ విజయ్ చాలా ప్రాక్టికల్గా పెళ్లాడేసాడు అని తెలియజేసింది. జాన్వి ని తను స్వయంవరం కోసం మూడు పేర్లను ఎంచుకోమని హోస్ట్ అడగగా ..అందులో ఆమె హృతిక్ రోషన్, రణబీర్ టైగర్ అని మూడు పేర్లు చెప్పింది. అయితే పెళ్లయిన రణబీర్ పేరు చెప్పడం వెనుక లాజిక్కు ఉంది.. కానీ ఆల్రెడీ భార్యకు విడాకులు ఇచ్చిన వేరొక నటితో ప్రేమలో ఉన్న హృతిక్ పేరును జాన్వి ఎందుకు చెప్పింది. ఇక తర్వాత టైగర్ పేరు సరైన సమాధానం కాదని చెప్పగా.
ఆ తర్వాత హొస్ట్ జాన్వికి విజయ్ దేవరకొండ పేరును సూచించగా దానికి వెంటనే స్పందిస్తూ జాన్వి అతను ఆచరణాత్మకంగా వివాహం చేసుకున్నారని తెలియజేసింది. దీంతో విజయ రష్మిక డేటింగ్ లో ఉన్నారని జాన్వీ కన్ఫామ్ చేసిందని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ జంట స్నేహం ప్రేమ వ్యవహారంపై ఈ ముద్దుగుమ్మ ఎన్నోసార్లు హింట్ ఇచ్చింది. కానీ విజయ రష్మిక మాత్రం మేమిద్దరం కేవలం స్నేహితులమే అని తెలియజేస్తున్నరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: