హరిహర వీరమల్లు పరిస్థితి ఏమిటి ?

Seetha Sailaja
ఈమధ్య విశాఖపట్నంలో జరిగిన పరిణామాలతో తీవ్ర ఆవేశానికి గురైన పవన్ కళ్యాణ్ తన విశ్వరూపాన్ని చూపెడుతున్నాడు. ఎన్నికలు ఇంకా చాలదూరంలో ఉన్నప్పటికీ అప్పుడే ఎన్నికలు వచ్చేసాయా అన్నవిధంగా పవన్ తన రాజకీయ వ్యూహాలను మారుస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా రాజకీయాలలో తలములకలై ఉన్న పవన్ తాను ఒప్పుకున్నా సినిమాలు ముఖ్యంగా హరిహర వీరమల్లు ఎప్పటికి పూర్తి చేస్తాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.  

పవన్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘హరిహర వీరమల్లు’ ప్రారంభించిన నాటి నుండి ఎదోఒక అడ్డంకి ఆమూవీకి వస్తూనే ఉంది ఈమూవీని వచ్చే సంవత్సరం వేసవిలో రిలీజ్ చేయాలని ఈమూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈమూవీ షూటింగ్ ఇంకా 50 శాతం వరకు పూర్తి కావలసి ఉంది అంటున్నారు. ఇప్పటికే ఈసినిమా విషయంలో జరుగుతున్న ఆలస్యానికి క్రిష్ తలపట్టుకుంటున్నట్లు టాక్.

వాస్తవానికి ఈమూవీకి సంబంధించిన పెండింగ్ షూటింగ్ ను దీపావళి తరువాత షూటింగ్ మొదలుపెట్టి తాను పూర్తి చేస్తాను అని పవన్ మాట ఇచ్చినప్పటికీ ఎంతవరకు పవన్ తాను ఇచ్చిన మాట పై నిలబడతాడు అన్నసందేహాలు చాలామందికి ఉన్నట్లు తెలుస్తోంది. దీనికికారణం పవన్ కళ్యాణ్ ను విపరీతంగా రెచ్చగొడుతూ అధికారిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు వరసపెట్టి చేస్తున్న కామెంట్స్ అని అంటున్నారు. దీనికితోడు ఆవేశపరుడైన పవన్ అధికారిక వైఎస్ఆర్ పార్టీ ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహాలతో పవన్ అనుకున్న విధంగా ఈ నెలాఖరు నుండి ‘హరిహర వీరమల్లు’ సెట్స్ పైకి వచ్చే అవకాశాలు చాల తక్కువ అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

అదే జరిగితే ‘హరిహర వీరమల్లు’ సమ్మర్ రేస్ ను కూడ మిస్ అయ్యే అవకాశం ఉంది అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. ఈసినిమా పూర్తిచేసి పవన్ నటించవలసి ఉన్న ‘వినోదాయ సీతం’ రీమేక్ తో పాటు ‘సాహో’ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో మరొక మూవీ పవన్ కళ్యాణ్ చేయవలసి ఉంది. అయితే పవన్ దృష్టి మాత్రం సినిమాల కంటే ఎక్కువ రాజకీయాల పై ఉంది అన్నది ఓపెన్ సీక్రెట్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: