వైరల్ అవుతున్న సమంత సర్జరీ మ్యాటర్...!!

murali krishna
సమంత.. ఈ హీరోయిన్ పేరు కు ప్రత్యేకంగా అయితే పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేసావే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య తో పెళ్లి విడాకులతో సమంత పేరు కేవలం సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా మారుమోగిపోయిందట.. అంతేకాదు విడాకుల తర్వాత సమంత ఏ చిన్న పని చేసినా కూడా అది క్షణాల్లో వైరల్ అయ్యేది. ఇక ఈ నేపథ్యంలోనే సమంత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోందట..

దీంతో సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో ఆమె మీద ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. సమంత ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆమె స్కిన్ కి ట్రీట్మెంట్ చేయించుకుందని,గర్భసంచి తీయించుకుందని ఇలా ఆమె మీద రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సమంత ఫోటోలు చూసిన చాలామంది ఆమె ఖచ్చితంగా ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకుందని అంటున్నారట . సమంత తాజాగా డాగ్ ఫుడ్ సంస్థకి సంబంధించిన ఒక యాడ్ లో కనిపించింది. ఆ యాడ్ కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ గా మారాయి. ఇక ఆ ఫోటోల్లో సమంత ను చూసిన చాలామంది ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు.

సమంత ఏంటి ఇలా మారిపోయింది? ఆమె మొహానికి ఏమైంది ఇలా తయారైంది? చూడడానికి చాలా చండాలంగా ఉంది అంటూ.. ఆమెను చూసిన జనాలు కామెంట్లు పెడుతున్నారట.. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత తన పెదాలకి సర్జరీ చేయించుకుందని, ఇక ఈ నేపథ్యంలోనే సమంత మొహం అలా మొత్తం చేంజ్ అయిపోయిందని తెలుస్తోంది. అందువల్లే సమంత చాలా రోజుల నుండి సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా సమంత కుందనపు బొమ్మలా ఉన్న తన ముఖాన్ని సర్జరీ చేయించుకొని చండాలంగా మార్చుకుంది అంటూ ఆమెను చూసిన జనాలు మాట్లాడుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: