ఆర్ఆర్ఆర్: జపాన్ లో సూపర్ రికార్డ్?

Purushottham Vinay
ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 21న జపాన్‏లో గ్రాండ్‏గా విడుదలైంది.పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురు ట్రిబుల్ ఆర్ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గోన్నారు. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జపాన్ దేశంలో rrr సినిమాకు అత్యుత్తమ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పటివరకు జపాన్ లో విడుదలైన భారతీయ చిత్రాలన్నింటికంటే ఎక్కువ ఓపెనింగ్స్ నమోదు చేసుకుని రికార్డ్ సృష్టించింది. నివేదికల ప్రకారం ఈ సినిమా మొదటి రోజే దాదాపు రూ. 1.06 కోట్లు రాబట్టింది. గతంలో ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఒక్కరోజే రూ. 90 లక్షలతో రికార్డ్ సృష్టించిన.. ఆ రికార్డ్ బ్రేక్ చేసింది ట్రిబుల్ ఆర్. ఇక ఈ మూవీ వారాంతపు వసూళ్లు రూ. 3.5 కోట్లకు పైగా ఉండవచ్చని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం జక్కన్న అండ్ టీం జపాన్ లో సందడి చేస్తున్నారు.



జపాన్ అభిమానులను తారక్, చరణ్‏ కలుసుకున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తమ అభిమాన హీరోలను చూడగానే జపాన్ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పలు రకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రావడమే కాకుండా అంతర్జాతీయంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఇక రాజమౌళి తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే రాజమౌళి పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు తాను తెరకెక్కించిన సినిమాలన్నింటికి మించి మహేష్ తో చేయబోయే ఉంటుందని స్వయంగా జక్కన్న చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. వచ్చే ఏడాది వీరి కాంబోలో రాబోయే చిత్రం పట్టాలెక్కనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: