షాకింగ్.. అసలు నైజాంలో ఏం జరుగుతోంది?

murali krishna
నైజామ్ అంటే దిల్ రాజు. దిల్ రాజు అంటే నైజాం. ఇంకా సూటిగా చెప్పాలంటే నైజాం కింగ్ దిల్ రాజు. ఓ పెద్ద సిని మాను నైజాంలో రిలీజ్ చేయా లంటే దిల్ రాజు తర్వాతే ఎవరైనా.
ఈ ప్రాంతం లో అంత హోల్డ్ సంపా దించాడు ఈ నిర్మాత కమ్ డిస్ట్రి బ్యూటర్. అయితే ఇదంతా గతం.

దిల్ రాజు ప్రాభ వానికి మెల్లగా బీటలు పడు తున్నాయి. పెద్ద సినిమాలు అతడి చేజారిపోతున్నాయి. మొన్నటి కిమొన్న ఆచార్య విషయం లో ఏం జరిగిందో అందరం చూశాం. అంత కంటే ముందు కూడా కొన్ని పెద్ద సినిమాలు దిల్ రాజుకు దక్కలేదు. ఇప్పుడు వాటికి మిం చిన దెబ్బ దిల్ రాజుకు తగిలింది.

సంక్రాంతి సినిమా ల్లో రెండు పెద్ద సిని మాలు దిల్ రాజుకు హ్యాండిచ్చాయి. అవే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి. చిరంజీవి, బాలకృష్ణ నటిస్తున్న ఈ రెండు పెద్ద సినిమాల నైజాం రైట్స్ ను దిల్ రాజు దక్కించుకో లేకపోయారు. ఈ రెండు సినిమాల్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

నిజానికి ఒకప్పుడు మైత్రీ-దిల్ రాజు మధ్య మంచి బంధం కొనసాగింది. కానీ ఇప్పుడు మైత్రీ రూటు మార్చింది. నిర్మాణంతో పాటు డిస్ట్రి బ్యూషన్ లో కూడా మెల్లమెల్లగా అడుగుపెట్టింది. ఇప్పుడీ రెండు సంక్రాంతి సినిమాలతో నైజాంలో కూడా కాలుపెట్ట బోతోంది. ఈ మేరకు సీడెడ్ కు చెందిన శశి మేనేజ్ మెంట్ తో కలిసి సొంతంగా డిస్ట్రి బ్యూషన్ ఆఫీస్ తెరిచే ఆలోచనలో ఉంది. మరో పెద్ద సంస్థ వీళ్లతో చేతులు కలుపుతోంది.

ఇదే కనుక జరిగితే, ఇక మైత్రీ నుంచి దిల్ రాజుకు సిని మాలు లేనట్టే. ఇప్పటికే కొన్ని నిర్మాణ సంస్థల నుంచి దిల్ రాజు ఆఫర్లు అందుకోలేక పోతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మైత్రీ కూడా చేరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: