కోలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజిత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే అజిత్ ఇప్పటికే తాను నటించిన అనేక మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే అజిత్ ఆఖరుగా వలిమై అనే మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు.
ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన వలిమై మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అజిత్ , హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తునివు అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించలేదు. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కి విడుదల చేయాలని మూవీ యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.