నందమూరి నటసింహం బాలకృష్ణ తనకంటూ కొన్ని విలువలు, హద్దులు పెట్టుకుంటాడు. అయితే ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా కొన్ని పనులకు దూరంగా ఉంటూ వచ్చాడు.ఇక ఇప్పుడు మాత్రం తన నియమాలు, నిబంధనలు కాస్త పక్కకి పెట్టినట్టు కనిపిస్తోంది.అయితే ఇది వరకు ప్రకటనల్లో నటించను అని చెప్పిన.. బాలయ్య ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచాడు.కాగా ఓ యాడ్‌లో నటించేందుకు బాలయ్య అంగీకారం తెలిపినట్టు సమాచారం.ఇకపోతే సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ కోసం బాలయ్య ఈ యాడ్ చేయబోతోన్నాడట. బాలయ్య నటిస్తున్న మొదటి యాడ్ కావడంతో చాలా హై బడ్జెట్ అంటే క్రేజీగా ఉండేట్టు డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక బాలయ్య రేంజ్‌కు తగ్గట్టుగా మంచి పారితోషికం కూడా ఇస్తున్నారట.ఇప్పుడు యాడ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి, అందులోని లగ్జరీ కారు ఫోటో వైరల్ అవుతోంది. ఇక మొత్తానికి ఈ యాడ్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందని తెలుస్తోంది.అయితే అసలే మన హీరోలు ఈ మధ్య సినిమాలకంటే ఎక్కువగా యాడ్స్ చేస్తూ సంపాదించేస్తోన్నారు. ఇక ఇందులో అల్లు అర్జున్, మహేష్ బాబు ముందంజలో ఉన్నారు. కాగా రామ్ చరణ్ కూడా యాడ్స్‌లో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. ఎన్టీఆర్ సైతం ప్రకటనల్లో నటిస్తుంటాడు. అయితే ప్రస్తుతం టాప్ స్టార్లంతా కూడా తమ తమ బ్రాండ్ వ్యాల్యూకి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
అంతేకాదు దర్శకులు సైతం ఇలా యాడ్స్ తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు.ఇక త్రివిక్రమ్, హరీష్ శంకర్ వంటి వారు యాడ్స్‌కు సైతం భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పుడు బాలయ్య నటిస్తోన్న ఈ యాడ్‌ను ఎవరు తెరకెక్కిస్తున్నారు.. ఈ యాడ్ ఎప్పుడు వస్తుందన్న విషయాలు మాత్రం ఇంకా తెలియడం లేదు.ఇకపోతే కర్నూలు కొండారెడ్డి బుర్జు మీద తన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేసిన బాలయ్య.. సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్టుగా ప్రకటించేశాడు. ఇక వీరసింహారెడ్డి అంటూ గర్జించేందుకు బాలయ్య రెడీ అయ్యాడు. సంక్రాంతికి మాస్ జాతరే అన్నట్టుగా కనిపిస్తోంది..!!