బాలకృష్ణ మూవీ కోసం అలా ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ , బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించగా , బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అలా అఖండ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.


ఈ మాస్ ఎంటర్టైనర్ మూవీ లో శృతి హాసన్ , బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా , వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది.


ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయాలని మూవీ యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి ,  బాలకృష్ణ సినిమా కోసం ఎక్కువ శాతం బాలీవుడ్ నటీనటులను తీసుకోవాలి అని డిసైడ్ అయినట్లు ,  అందులో భాగంగా కొంత మంది బాలీవుడ్ నటీనటులతో అనిల్ రావిపూడి చర్చలు కూడా జరుపుతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: