మన సౌత్ టాలెంటెడ్ సీనియర్ ఆర్టిస్ట్ లలో ప్రియమణి కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇక ఈమె హీరోయిన్ గా వెలుగుతున్న రోజుల్లో సౌత్ స్టార్స్ అందరితో పని చేసింది.అయితే ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి ... 2017లో ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు.ఇకపోతే వివాహం చేసుకుని ఐదేళ్లు దాటిపోయింది. ఇక ఇద్దరూ తమ తమ కెరీర్స్ లో బిజీగా ఉన్నారు.ఇదిలావుంటే ఇటీవల కాలం లో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు బాగా పెరిగిపోయాయని.. వీళ్లిద్దరూ విడిపోయి..వేర్వేరుగా ఉంటున్నారు అని,
అతి త్వరలోనే వీళ్లిద్దరు విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి.అయితే ఎప్పటికప్పుడు ఆమె టీమ్ వాటిని ఖండిస్తూనే ఉంది. అయితే ఇక అందులో నిజమెంత అనేది ఆమె అభిమానులకు సస్పెన్స్ గానే ఉండిపోయింది.కాగా ఈ విషయం ప్రియమణి కూడా గమనించినట్లు ఉంది. అయితే రీసెంట్ గా ఓ వీడియోని తన సోషల్ మీడియా ఎక్కౌంట్ లో షేర్ చేసింది.ఇక అందులో ఆమె మాధవన్ రాక్రెట్రీ చిత్రం సక్సెస్ పార్టీలో తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనపడింది. అయితే ఇంతకు మించి వీరి బంధం వీగలేదు అనటానికి రుజువు ఏమి కావాలి? అలాగే ఇనిస్ట్రా ఎక్కౌంట్ లో priya Mani raj అనే పేరు ఉంటుంది.
అంతేకాదు మరో ప్రక్క ప్రియమణి చేతి నిండా ఆఫర్స్ తో వరుస సినిమాలు, గేమ్ షోలు చేస్తున్నారు. ఇక భర్త ముస్తఫా రాజ్ అమెరికాలో ఆయన ప్రొఫెషన్ లో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇక ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించింది.అయితే ప్రియమణితో అతడి వివాహం చెల్లదని సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. అయినా వాటి ఇంపాక్ట్ ఏమీ ..వీరి సాంసారిక జీవితంపై లేదని తెలుస్తోంది.ఎవరే అతగాడు (2003) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రియమణి. అయితే ఇక ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.ఇక ఆ తర్వాత జగపతి బాబు హీరోగా వచ్చిన 'పెళ్లైన కొత్తలో' సినిమాతో తెలుగువారికి మరింత పరిచయమైంది. కాగా ప్రియమణి తమిళ సినిమా పరుత్తివీరన్‌లో ఫీమేల్ లీడ్‌గా కార్తీ సరసన నటించి జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది..!!