విజయ్ - హరీష్ కాంబినేషన్ సినిమా సెట్?

Purushottham Vinay
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ మూవీ చాలా దారుణంగా ఫస్ట్ డే ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని షాకిచ్చింది.దీంతో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మరోసారి భారీ స్థాయిలో చేయాలనుకున్న `జనగణమన` ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశాడు. ఈ మూవీని పక్కన పెట్టిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న `ఖుషీ` మూవీలో నటిస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్. కశ్మీర్ తో పాటు హైదరాబాద్ లోనూ కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. సమంత యుఎస్ కు వెళ్లిన కారణంగా ఆలస్యం అవుతున్నఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతోంది.అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ తో క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రారంభించాలని స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడంటూ షికారు చేస్తున్నాయి. ఈ ఇద్దరు కలిసి రీసెంట్ గా జరిగిన శివ కార్తికేయన్ `ప్రిన్స్` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.


ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అయితే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాత్రం హరీష్ శంకర్ తో కలిసి వర్క్ చేయడానికి ఆసక్తిని చూపించడం లేదని ప్రచారం జరుగుతోంది.ఈ వార్తలపై తాజాగా స్పందించిన హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. తాను విజయ్ దేవరకొండని ఒకే ఒక్కసారి కలిశానని అయితే మా కలయికపై మీడియా భిన్నకథనాలని రాయడం మొదలు పెట్టిందన్నాడు. కానీ ఇన్ సైడ్ టాక్ మాత్రం వీరిద్దరి క్రేజీ కాంబో సెట్టవడం ఖాయంగా కనిపిస్తోందని దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి చూడాలి ఈ కాంబినేషన్ లో మూవీ ఎప్పుడు అనౌన్స్ అయ్యిందో. ఎలా ఉండబోతుందో.. అయితే ఖచ్చితంగా కొంత సమయం వెయిట్ చెయ్యాల్సిందే. ఎందుకంటే ఇద్దరూ కూడా తమ కమిట్ సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నారు. బహుశా అవి పూర్తయ్యాక వీళ్ళ సినిమా ఉండొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: