టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పెద్ద నిర్మాణ సంస్థ అయిన ఏషియన్ సంస్థ ఎలాంటి సినిమాలను చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో సినిమాలను రూపొందించిన ఈ నిర్మాణ సంస్థ ఇటీవల కాలంలో రెండు సినిమాలను నిర్మించి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. నాగార్జున హీరోగా నటించిన ఘోస్ట్ చిత్రాన్ని నిర్మించి ఆ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది ఏసియన్ నిర్మాణ సంస్థ.
ఆ తరువాత వెంటనే 15 రోజుల వ్యవధిలోనే దీపావళి సందర్భంగా మరొక సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది శివ కార్తికేయన్ హీరోగా అనుదీప దర్శకత్వంలో ప్రిన్స్ అనే సినిమాను పూర్తి చేసిన ఈ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని అక్టోబర్ 21వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే ఘోస్ట్ చిత్రంతో భారీగా నష్టపోయిన ఈ నిర్మాణ సంస్థ ప్రిన్సు సినిమాతో దానిని కవర్ చేసుకుంటుందా అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది అని చెప్పాలి.
గోస్ట్ సినిమా బాగానే ఉన్నా కూడా తప్పు ఎక్కడ జరిగిందో ఏమిటో తెలియదు కానీ ఈ సినిమాకు అనుకున్న కలెక్షన్లు మాత్రం రాలేదని చెప్పాలి. బయటకు చెప్పడం లేదు కానీ ఈ సినిమాతో భారీగానే నిర్మాతలు నష్టపోయారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ ప్రిన్స్ సినిమా అయినా వారికి భారీ లాభాలను తీసుకువచ్చి గోస్ట్ నష్టాలను మరిచిపోయేలా చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మరి అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రిన్స్ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అందిస్తుందో తెలియాలి అంటే కొన్ని రోజులు లేచి చూడవలసిందే. అనుదీప్ రెండవ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తే ఆయన కూడా ద్వితీయ విజ్ఞాన్ని దాటినట్లే అని చెప్పాలి.