వారసుడు కోసం ఆ పని చేసిన విజయ్!!

P.Nishanth Kumar
విజయ్ దళపతి హీరోగా తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా ఉన్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు భారీ బడ్జెట్ సినిమాగా రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి ముందుకు రావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ నేపథ్యం లో ద్విభాషా చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్న ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది అని విజయ్ దళపతి అభిమానులు ఆశిస్తున్నారు
అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ సినిమాలు చేసే దర్శకుడు అయిన వంశీ పైడిపల్లి ఈ సినిమాను కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చేశాడని అంటున్నారు ఇక ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. పలు భాషలలో అగ్ర సంగీత దర్శకుడుగా ఉన్న తమిళంలో తన సత్తా చాతడానికి ఈ సినిమాను ఉపయోగించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని ఆల్బమ్ పై క్రేజీ రావడం కోసం ఆయన ఒక వినూత్నమైన ప్రయోగం చేయడం విశేషం.
విజయ దళపతి తోనే ఏకంగా ఆయన గొంతు కలపడం ఇప్పుడు రెండు రాష్ట్రాలలోనూ ఎంతో ఆసక్తికరమైన విషయం గా మారింది. ఇప్పటిదాకా చాలా మంది హీరోలతో పాటలు పాడించిన విజయ్ దళపతి తో కూడా పాటలు పాటించడం కేవలం ఆయనకు మాత్రమే సాధ్యం అని చెబుతున్నారు. గతంలో విజయ్ దళపతి పాట పాడిన సందర్భాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఈసారి విజయ దళపతితో పాట పాడించడం మరింత విశేషం అయ్యింది. ఇక ఈ సినిమా ద్వారా తప్పకుండా పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ ఎదగడం ఖాయమని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఇప్పటికే తన పాటలతో సౌత్ సినిమా పరిశ్రమను మొత్తం అలరించిన దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు నార్త్ లోను తన సత్తా చాతడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: