బాలయ్య సంక్రాంతికి సిద్ధమవుతున్నాడు !!

P.Nishanth Kumar
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బంధం గట్టి ప్రయత్నా లు చేస్తూ ఉండ గా తాజాగా బయటకు వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా సంక్రాంతికి తప్పకుండా విడుదలవుతుంది అనే తెలుస్తుంది. ఈ సినిమా యొక్క టైటిల్ ను అలాగే టీజర్ ను విడుద ల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేసింది. అక్టోబర్ 21వ తేదీన దీనికి సంబంధించిన టైటిల్ రీవీల్ కాబోతూ ఉండడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవడంతో ఈ సినిమా తప్పకుండా సంక్రాంతి విడుదలవుతుంది అని బాలకృష్ణ అభిమానులు నమ్ముతున్నారు.

మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే దర్శకుడైన గోపీచంద్ మలినేని ఈ సినిమాను కూడా మాస్ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగానే చేశాడు అన్న వార్తలు ఇప్పు డు వినిపిస్తున్నాయి. శృతిహాసన్ కథనాయకగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అఖండ లాంటి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత బాల కృష్ణ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులను అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయని చెప్పాలి. 

అయితే సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల పట్ల కొంత గందరగోళం నెలకొడుతూ ఉండడంతో బాలకృష్ణ ఈ సినిమాను విడుదల చేస్తాడు లేదా అన్న అనుమా నాలు చాలామంది కలుగుతున్నాయి. ఆ విధంగా బాలకృష్ణ సంక్రాంతికి తప్పకుండా రావాలని నిర్మాతలు చెప్పడం ఈ సినిమా వాయిదా పడదు అని చెప్పవచ్చు.ఇకపోతే సంక్రాంతి కి చిరంజీవి హీరో గా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రావడం ఖాయం అయ్యింది. అంతే కాకుండా అఖిల్, విజయ్ దళపతి, అలాగే ప్రభాస్ కూడా తమ తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధం అయ్యారు. మరి ఈ భారీ సంక్రాంతి పోరు లో బాలకృష్ణ పై చేయి సాధిస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: