మోహన్ రాజా పరిస్థితి పై ఆశక్తికర చర్చలు !
అయితే మరికొందరు మాత్రం ఈ మూవీ కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ రావడం కష్టం అంటూ మరో ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ ప్రచారాన్ని ఈమూవీ నిర్మాతలు తిప్పికొడుతున్న పరిస్థితులలో ‘గాడ్ ఫాదర్’ విజయం పై కొంత కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. ఈమూవీ కలక్షన్స్ ఎలా ఉన్నప్పటికీ ఈమూవీ దర్శకుడు మోహన్ రాజా కు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఈమూవీ ‘లూసీఫర్’ మూవీకి రీమేక్ అవ్వడంతో ఈమూవీని ఇప్పటికే ఓటీటీ లో అనేక లక్షనమంది చూసిన పరిస్థితులలో ఈమూవీని రీమేక్ చేసి మెప్పించడం అంత సులువు కాదనీ ఆవిషయంలో మోహన్ రాజా విజయవంతం అయ్యాడు అంటూ ప్రశంసలు వస్తున్నాయి. అంతేకాదు ‘ఆచార్య’ తో పోలిస్తే ఈమూవీ అన్నివిధాలా మెరుగ్గా ఉందని ఈవిషయంలో నూటికి నూరు శాతం మార్కులు మోహన్ రాజాకే వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈమూవీలో ‘అందరూ దొరికిపోండి’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ సీన్ ఒరిజనల్ మూవీ ‘లూసీఫర్’ లో లేదనీ ఇది అంతా మోహన్ రాజా క్రియేటివిటీ అంటున్నారు. అదేవిధంగా ఈమూవీలో అనేక సీన్స్ ను మోహన్ రాజా తన ఆలోచనలతో కొత్తగా క్రియేట్ చేసి విజయం సాధించాడనీ దీనితో దర్శకుడుగా మోహన్ రాజాకు మంచి భవిష్యత్ ఉంటుంది అంటున్నారు. ఈ విషయాలు అన్నీ ఆలోచించికాబోలు నాగార్జున తన 100వ సినిమాకు మోహన్ రాజా ను దర్శకుడుగా ఎంపిక చేయడం ఖరార్ అయింది అంటున్నారు..