అప్పుడు చిరు, ఇప్పుడు బాలయ్య.. త్రిష సేమ్ కండిషన్?
ఈ సినిమాలో కుందనపు బొమ్మలా కనిపించిన త్రిష అందానికి మరోసారి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మళ్ళీ త్రిష ఫామ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ వఇచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో చాన్స్ అందుకుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య ఈ సినిమా ముగిసిన వెంటనే రావిపూడి తో సినిమా స్టార్ట్ చేస్తాడు. బాలయ్య కూతురుగా శ్రీ లీలా నటిస్తుంది.
అయితే బాలయ్యతో సినిమా కోసం త్రిష ఒక పెద్ద కండిషన్ పెట్టిందట. ఎవరు ఊహించడ కోటి యాభై లక్షల పారితోషకం డిమాండ్ చేసిందట. కాగా గతంలో చిరంజీవి సినిమా స్టాలిన్ విషయంలో కూడా ఇలాంటిదే చేసింది. 80 లక్షలు ఇస్తేనే సినిమా చేస్తానని డిమాండ్ చేసిందట.. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అయ్యి కోటి 50 లక్షలు అడగడంతో నిర్మాతలు కూడా షాక్ అయ్యారట. మరి ఈ అమ్మడిని ఫైనల్ చేస్తారో లేదో అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.