బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు హీరో రామ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ స్థాయిలో బౌన్స్ బ్యాక్ అయినా ఈ హీరో ఆ తర్వాత చేసిన రెండు సినిమాల తోనూ ప్రేక్షకులను యధావిధిగా నిరాశపరిచాడు. దాంతో ఇప్పుడు చేయబోయే సినిమా ఆయనకు మళ్ళీ భారీ విజయాన్ని తెచ్చి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సక్సెస్ ఉంటేనే హీరోలకు మంచి మార్కెట్ ఏర్పడుతుంది కాబట్టి ఆ సక్సెస్ కొట్టడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పాలి.
మొదట్లో ఎక్కువగా లవ్ స్టోరీ సినిమాలను చేసే ఈ హీరో ఆ తర్వాత మాస్ మసాలా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆ క్రమంలోనే ఆయన చేసిన ఎన్నో ప్రయత్నాలు చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే బోయపాటి శ్రీనుతో ఊర మాస్ చిత్రాన్ని చేయడానికి ఆయన రెడీ అయిపోతున్నాడు ఈ సినిమా తప్పకుండా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చిపెడుతుంది అన్న నమ్మకాన్ని వ్యక్త పరుస్తున్నాడు. దానికి తోడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన కథ సినిమా అఖండ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.
అంతటి భారీ హిట్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా ఈ సినిమా ఆ రెంజ్ లోనే ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు.అయితే ఓ విషయం అభిమానులను ఎంతగానో కలవర పెట్టిస్తుంది. ఈ సినిమాలో రామ్ తండ్రిగా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన నటించిన తెలుగు సినిమాలు పెద్దగా విజయం అందుకొని నేపథ్యంలో ఈ సినిమాలో ఆయన నటించడం అవసరమా అన్నట్లుగా వారు పెదవి విరుస్తున్నారు. గని సినిమాలో నటించిన సునీల్ శెట్టి ఆ సినిమాల ద్వారా భారీ స్థాయిలో మూట గట్టుకున్నాడు అందుకే ఆయన నటిస్తే సినిమా ఫ్లాప్ అవుతుందేమోనన్న ఉద్దేశంతో రామ్ అభిమానులు ఆయనను ఈ సినిమాలో పెట్టుకోవద్దు అనే విధంగా సూచనలు చేస్తున్నారు.