ఆదిపురుష్ పై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
లేటెస్ట్ గా విడుదలైన ‘ఆదిపురుష్’ మూవీ టీజర్ పై భారీ ఎత్తున విమర్శలు ట్రోలింగ్ రావడమే కాకుండా ఈసినిమాను బ్యాన్ చేయాలి అంటూ కొందరు ఘాటుగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. భారతదేశ ప్రజలు అత్యంత పూజనీయుడుగా భావించే శ్రీరామచంద్రుడి స్థాయి తగ్గించే విధంగా ఈమూవీ టీజర్ ఉంది అంటూ అనేకమంది విమర్శలు చేస్తూ ఉండటంతో ప్రభాస్ అభిమానులు దిగాలు పడిపోతున్నారు.



ఈ పరిస్థితులలో హీరో మంచు విష్ణు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆదిపురుష్’ మూవీ టీజర్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 'ఆదిపురుష్' టీజర్ చూడగానే తనకు అసంతృప్తిగా అనిపించిందని’ మంచు విష్ణు ప్రముఖ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించాడు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంతవరకు వాస్తవం అంటూ కొందరు షాక్ అవుతున్నారు.



అంతేకాదు రామాయణం మీద సినిమా అంటే లైవ్ యాక్షన్ మూవీ అనుకున్నానని యానిమేషన్ చిత్రం అవుతుందని అనుకోలేదు అంటూ మంచు విష్ణు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు కూడ పాన్ ఇండియా హీరోగా మారాలని ప్రయత్నిస్తున్నాడు. అతడు లేటెస్ట్ గా నటించిన ‘జిన్నా’ మూవీని తెలుగు తమిళ మళయాళ హిందీ భాషలలో విడుదల చేస్తున్నారు. అదేవిధంగా మంచు విష్ణు ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ‘తెలుగు వాడిగా నా అభిప్రాయాన్ని చెబుతున్నాను. రామాయణం మీద తీస్తున్నందున ఇది మెయిన్ స్ట్రీమ్ లైవ్ యాక్షన్ సినిమా అవుతుందని తాను భావించానని అయితే ఇది యానిమేషన్ చిత్రం అవుతుందని తాను ఊహించలేదు’ అంటూ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.. అందుకే అందరూ నిరాశ చెందారు. అయితే మీరు ఇదొక యానిమేషన్ చిత్రం అని చెప్పి ఆపై టీజర్ ను విడుదల చేస్తే ట్రోల్స్ వచ్చేవి కాదు’  మంచు విష్ణు అన్నారు.


ఇది గతంలో రజినీకాంత్ నటించిన 'కొచ్చాడియన్' సినిమాలా మారుతుందా అన్న సందేహాలు తనకు ఉన్నాయని విష్ణు అన్నట్లు తెలుస్తోంది. సినిమా ఎలాగైనా తీయవచ్చనీ ఆవిషయమై ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తే మంచిది అని తన అభిప్రాయాన్ని తెలిపినట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: