మెగా స్టార్ వెనకడుగు వేస్తున్నాడా!!

P.Nishanth Kumar
సంక్రాంతి కానుకగా మెగా స్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. చిరు 154 వ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రుతి హసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ను చకచక పూర్తి చేస్తున్నాడు చిరంజీవి. వాస్తవానికి సంక్రాంతి కి విడుదల చేయాలనే ఆలోచన ఎప్పుడో వచ్చిందో అప్పటినుంచి ఈ సినిమా ను ఫాస్ట్ గా చేస్తున్నాడు చిరు.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం చిరంజీవి సంక్రాంతి కి రావాలనే ఉద్దేశ్యాన్ని వెనక్కి తీసుకోబోతున్నాదట. కారణం ఏంటో తెలియదు కానీ ఇది మెగా అభిమానులను ఎంతో నిరాశాపరుస్తుందట. దసరా కి చిరు ని చూసి వెంటనే సంక్రాంతి కి అయన సినిమా రావడం అనేది అందరిని ఎంతో సంతోశాపరిచే విషయమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో చాలామంది అభిమానులు ఈ హీరో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నారు.  

ఈ సినిమాలో చిరంజీవి మాస్ లుక్ తో కనిపించనున్నారు. ఆయన యాస .. డైలాగ్ డెలివరీ .. లుక్ డిఫరెంట్ గా ఉండనున్నాయి. అంతే కాకుండా చిరంజీవి తో కలిసి రవితేజ కూడా ఈ సినిమా లో ఓ కీలక పాత్ర లో నటిస్తుండడం విశేషం. ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ భారీ స్థాయి లో ఉంటాయని అంటున్నారు.  ఇటీవల కాలంలో ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో, ఈ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చనే ప్రచారం ఊపందుకుంది. వచ్చే వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. మరి మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. త్వరలోనే దీనికి సంబందించిన ఓ వార్త వెలువడనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా ఈ సినిమా టైటిల్ ను దీపావళి కి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: