త్రివిక్రమ్ కు ఫోన్ చేసిన బాలకృష్ణ...!!

murali krishna
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న 'ఆన్‌స్టాపబుల్' టాక్ షో..


ఇప్పుడు రెండో సీజన్‌ (Season 2)కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), నారా లోకేష్‌ (Nara Lokesh) అతిథులుగా హాజరవగా.. వారితో బాలయ్య పెట్టిన ముచ్చట రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఈ ఎసిపోడ్ ఆదరణను దక్కించుకున్నట్లుగా ఆహా టీమ్ కూడా అధికారికంగా అయితే ప్రకటించింది. ఇక రెండో ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమోని కూడా వదిలారు. ఈ ఎపిసోడ్‌లో యంగ్ హీరోస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)లతో పాటు యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) కూడా వచ్చినట్లుగా ప్రోమోలో చూపించారు. ఇక ఈ ప్రోమోలో ఈ షోకి త్రివిక్రమ్ (Trivikram), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా రాబోతోన్నట్లుగా హింట్ ఇచ్చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి త్రివిక్రమ్‌కి మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆ బ్యానర్‌లో తెరకెక్కే ఏ చిత్రమైనా.. ముందు స్క్రిప్ట్ త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లిన తర్వాతే సెట్స్‌పైకి వెళుతుందట.. అంతటి ర్యాపో వారి మధ్య ఉంది.


ఈ షోలో నిర్మాత నాగవంశీ.. త్రివిక్రమ్‌కు ఫోన్ చేయగా.. బాలయ్య మాట్లాడుతూ.. 'త్రివిక్రమ్ షోకి ఎప్పుడొస్తున్నావ్' అని బాలయ్య అడిగారట . దానికి 'మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను సార్' అని త్రివిక్రమ్ అనగానే.. వెంటనే 'ఎవరితో రావాలో తెలుసుగా' అని బాలయ్య అనగానే.. క్లాప్స్‌తో షో దద్దరిల్లిపోయిందట.. ఈ హింట్‌తో ముందు నుండి వినిపించినట్లుగానే ఈ సీజన్‌లో ఖచ్చితంగా పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ ఈ షోకి వస్తారనేదానిపై క్లారిటీ  అయితే ఇచ్చేసినట్లయింది. మొత్తంగా చూస్తే.. మొదటి ఎపిసోడ్‌తో పొలిటికల్‌గా బ్లాక్‌బస్టర్ అయితే.. రెండో ఎపిసోడ్ ఈ ప్రోమోతోనే ఈ షో సంచలనంగా మారిందట. ఇక పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌లతో ఈ షోలో బాలయ్య ఎలా ఆడుకుంటాడో చూడాలంటే మాత్రం.. ఇంకొన్ని ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయక తప్పదు మరీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: