ఆ పని చేసి అందరిని ఆశ్చర్య పరిచిన కాంతారా భామ...!!
మరి ఇప్పటికే చాలా ఘటనలు మనం చూసాం.. ఇక తాజాగా మరొక ఆశ్చర్యపోయే ఘటన ఇప్పుడు బయటకు వచ్చిందట.. తాజాగా రిలీజ్ అయినా కాంతారా సినిమా కోసం హీరోయిన్ క్రేజీ పని చేసింది.. ఇది విని అంతా ఆశ్చర్య పోతున్నారట..
రిషబ్ శెట్టి నటించిన కాంతారా సినిమా కన్నడంలో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర అసాధారణమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమా పరుగులు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదని తెలుస్తుంది... ఇప్పటికే కాంతారా సినిమా బాక్సాఫీస్ దగ్గర 58 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ముందు ముందు ఈ సినిమా కన్నడ లోనే 100 కోట్లు సాధించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటున్నారట.
ఇక కాంతారా తెలుగు వర్షన్ ను కూడా తాజాగా రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకుని దూసుకు పోతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రిషబ్ శెట్టికి జోడీగా నటించిన హీరోయిన్ సప్తమి గౌడ.. ఈమె ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అయితే ఈ సినిమా కోసం ఈమె చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యిందట... సప్తమి గౌడ ఈ సినిమా కోసమే రెండు వైపులా ముక్కు కుట్టించు కుందట.
ఈ సినిమాకు ముందు వరకు ఒక వైపు కూడా కుట్టించుకొని ఈ భామ ఈ సినిమా కోసం ఏకంగా రెండు వైపులా కుట్టించు కున్నట్టు రిషబ్ శెట్టి తెలిపాడట... ఇప్పుడు ఏ ఫోటో చుసిన ఈమె రెండు వైపులా ముక్కుపుడక కనిపిస్తూ వెలిగిపోతుంది అనే చెప్పాలి.. ఇదంతా విని నెటిజెన్స్ ఈమెను ప్రశంసిస్తున్నారు.. ఈ సినిమా తర్వాత ఈమె బాగా ఫేమస్ అయ్యి భారీ ఫాలోవర్స్ ను కూడా సంపాదించు కుందట. మరి ఈ సినిమాతో ముందు ముందు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.