పుష్ప సినిమా లో చంద్రబాబు ఉన్నాడా ? ఓరినీ మనం మిస్ అయ్యాంగా !

murali krishna
అల్లు అర్జున్, రష్మిక మందాన ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
1996 సంవత్సరం నుంచి 2004 మధ్య జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కింది. త్వరలో మూవీ సీక్వెల్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుండగా. ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం వైరల్ అవుతుంది. ఇందులో చంద్రబాబు నాయడు ఉన్నాడని అందరు అంటున్నారు. చంద్రబాబునాయుడు ఏపీ సీఎం గా తొమ్మిదేళ్లపాటు ఉన్న విషయం తెలిసిందే.. అయితే అప్పట్లో జరిగిన కధగా దీనిని తీసుకు వచ్చారు కాబట్టి పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు ఫోటో ఉండేటట్టు చేశారు.
చంద్రబాబు నాయుడు అభిమానులు ఈ విషయంపై సుకుమార్ ని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి సుకుమార్ ఎలాంటి లోపాలు కనిపించకుండా ఇలాంటి ప్లాన్ చేశాడని అంటున్నారు. పుష్స సినిమాలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఇక ఈ సినిమా రెండవ భాగమైన “పుష్ప: ది రూల్” పైన అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప మొదటి భాగం గతేడాది డిసెంబర్లో విడుదలైంది.
ఇక ఈ సినిమా రెండవ భాగం డిసెంబర్లో విడుదలవుతుందని అందరూ అనుకున్నారు కానీ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజులలో మొదలు కానుంది. దీంతో సినిమా విడుదల అవ్వడానికి వచ్చే ఏడాది వేసవి అవుతుందని కొందరు చెబుతున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ సెంటిమెంట్ మిస్ అవ్వకుండా ఈ సినిమాని కూడా ఈ ఏడాది డిసెంబర్ లోపల పూర్తి చేసి విడుదల చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.పుష్ప చిత్రం బాలీవుడ్‌లోను పెద్ద విజయం సాధించింది.ఇప్పుడు పుష్ప 2 చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: