నా బాడీ నా ఇష్టం ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్నాను...!!

murali krishna
బోల్డ్ బ్యూటీ శృతి హాసన్ విషయం ఏదైనా కుండబద్దలు కొట్టేస్తారు. మొహమాటాలు దాపరికాలు ఏమీ ఉండవు.ఆమె ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ తెరిచిన పుస్తకమే.కాగా తన బాడీలోని ఒక పార్ట్ కి సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఆమె క్లారిటీ ఇచ్చారు. అవును అది నిజమే అంటూ ఓపెన్ గా చెప్పేశారు. కొన్నాళ్లుగా శ్రుతి హాసన్ ముక్కు భిన్నంగా కనిపిస్తుంది. గతంలో మాదిరి లేదు. దీంతో సర్జరీ పుకార్లు తెరపైకి వచ్చాయి. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని అడగడంతో ఆమె నిజమే అని ఒప్పుకున్నారు.నేను నా ముక్కుకు సర్జరీ చేయించుకున్న మాట వాస్తవమే, అయితే అది అందం కోసం కాదు. నా ముక్కుకు గాయమైంది, ఆ కారణంగా సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. అందుకే నా ముక్కు మునుపటిలా లేదు. అయినా నాబాడీ నా ఇష్టం, ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదని శృతి హాసన్ అన్నారు. పుట్టుకతోనే చక్కని ముక్కు శృతి సొంతం. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. శృతి చెప్పినట్లు గాయం కారణంగా సర్జరీ చేయించుకుందేమో.. పాపం.
ఇక శృతి కెరీర్ ఊపందుకుంది. ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సరసన ఆఫర్స్ పట్టేసింది. ఆమె కెరీర్ లో సలార్ అతిపెద్ద ప్రాజెక్ట్ గా ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో శృతి హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే బాలయ్య 107వ చిత్రం, చిరంజీవి మెగా 154 చిత్రాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
అటు శృతి పర్సనల్ లైఫ్ లో కూడా హ్యాపీగా ఉంది. ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో లివింగ్ రిలేషన్ లో ఉంది. వీరిద్దరూ ముంబైలో ఒకే ఇంట్లో ఉంటున్నారు. శృతి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి శాంతను హాజరు కావడం విశేషం. దాదాపు రెండేళ్లుగా ఈ జంట కలిసి ఉంటున్నారు. కాగా గతంలో శృతి లండన్ ప్రియుడు మైఖేల్ కోర్ల్సే తో ప్రేమాయణం నడిపింది. అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఒకటి రెండు సందర్భాల్లో చెన్నైలోని కమల్ ఇంటికి మైఖేల్ వచ్చాడు. ఏమైందో తెలియదు 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: