అనుమానంతోనే ఆర్తి అగర్వాల్ - తరుణ్ దూరమయ్యారా..?
ఇక బయట సమాజంలో కూడా ఇలాంటివి జరుగుతాయి. కాని సినిమా ఇండస్ట్రీలో ఇలా జరగడం ఒక వింతే.. ఒక హీరోయిన్, హీరో గురించి అప్పట్లో బాగా పుకార్లు వినిపించాయి. ఇక వారు ఎవరో కాదు ఆర్తి అగర్వాల్, తరుణ్.. ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా ఉండి అందరూ అగ్ర హీరోలతో నటించింది. తరుణ్ ,ఆర్తి అగర్వాల్ మొదటి సినిమా నువ్వు లేక నేను లేను.. ఇక ఈ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. ఇక తర్వాత మళ్లీ తరుణ్ తో సఖియా సినిమా చేశారు. అయితే ఆర్తి అగర్వాల్ , తరుణ్ అయితే మొదటి సినిమాతోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అనే వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
ఇక ఈ విషయంపై ఇమ్మంది రామారావు మాట్లాడుతూ.. ఆర్తి అగర్వాల్ , తరుణ్ పీకల్లోతు ప్రేమించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఒకానొక సందర్భంలో చెల్లితో, తరుణ్ తో ఆర్తి కలిసి రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ చెల్లి తరుణ్ తో క్లోజ్ గా మూవ్ అవడం చూసి చెల్లితో గొడవ పడిందట ఆర్తి అగర్వాల్. ఇక ఈ విషయం అప్పట్లో బాగా వినిపించింది. ఇక తరుణ్ వాళ్ళమ్మ రోజా రమణి వాదన మాత్రం ఇంకోలా ఉంది అంటూ తెలిపారు ఇమ్మంది.
ఇక తరుణ్ అందరూ హీరోయిన్లతో బాగానే ఉండేవాడు. ఇంటికి వచ్చి వెళ్లేవారు. ఆమాత్రానికే ప్రేమ అంటూ పుకార్లు లేపారు. అంతేకాని తరుణ్ ఎవరిని ప్రేమించలేదని తెలిపింది రోజా రమణి. ఇక ఆర్తి అగర్వాల్ సినిమా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే తండ్రి ఒత్తిడి తీసుకురావడంతో పెళ్లి చేసుకుంది.
పెళ్లి ఎన్నో రోజులు లేదు.. విడాకులు తీసుకొని మళ్ళీ సినిమాల్లో నటించాలని అనుకుంది. అయితే సర్జరీ చేయించుకొని అది వికటించడంతో ఆమె మరణించింది. ఇక తరుణ్ కి కూడా అవకాశాలు తగ్గిపోయాయని అభిప్రాయపడ్డారు ఇమ్మంధి రామారావు.